మెగా ప్రిన్సెస్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక మొదటి సినిమా ‘ఒక మనసు’ ఫెయిల్ అయినా హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు మాత్రం చాల ఎక్కువగానే వచ్చాయి. అయితే నిహారిక వచ్చిన ఆఫర్లను అన్నీ ఒప్పుకోకుండా కేవలం తనకు మనసుకు నచ్చిన కథ కోసం ఎదురు చూస్తూ ఇంతకాలం గడిపింది.
ఎట్టకేలకు నిహారికకు నచ్చిన కథ దొరకడంతో ఆ కథ నిహారిక రెండవ సినిమాగా మారి పట్టాలు ఎక్కింది. అయితే ఈసినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న రాఘవయ్య గతంలో ‘ప్రజారాజ్యం’ పార్టీకి సంబంధించి పవన్ నిర్వహించిన ‘యువరాజ్యం’ విభాగంలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం పవన్ ‘జనసేన’ ట్రెజరర్ గా ఉంటున్న వ్యక్తి.
ఈయనకు జ్యోతిష్యంలో కూడ మంచి అనుభవం ఉంది అని అంటారు. కొంతమంది రాజక్రీయ ప్రముఖులకు సినిమా ప్రముఖులకు ముహుర్తాలు చూసే ఈయన మరో పెద్దాయినతో కలిసి ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసారు అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలిమ్ నగర్ దైవ సన్నిధానంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిన్న సినిమా ప్రారంభోత్సవం జరిగింది.
దర్శకులు మారుతి మెహర్ రమేశ్ లతో పాటు మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన శ్రీకాంత్ క్లాప్ తో ఈ సినిమా ప్రారంభం అయింది. నాగబాబు మెహర్ రమేశ్ లు గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటికే తమళంలో ఒక సినిమాను అంగీకరించిన నిహారిక ఇప్పుడు ఈసినిమాను కూడ అంగీకరించడంతో ఒకేసారి తన రెండు సినిమాలను పరుగులు పెట్తించే ఆస్కారం ఉంది. ఏమైనా నిహారిక తన హీరోయిన్ కెరియర్ ను చాల సీరియస్ గా తీసుకున్నట్లు అనిపిస్తోంది..