దువ్వాడ జగన్నాథం’ మూవీ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో పూజా హెగ్డే ఎక్స్ పోజింగ్ పై చేసిన వ్యాఖ్యలకు ఆ సమావేశానికి వచ్చిన మీడియా వర్గాలకే మైండ్ బ్లాంక్ అయినట్లు టాక్. ఈమె నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇప్పటికే ఐరన్ లెగ్ బ్యూటీగా ముద్ర వేయించుకుంది ఈ కన్నడ బ్యూటీ. 

దీనితో ‘దువ్వాడ’ సినిమాను ఎట్టి పరిస్తుతులలోను హిట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఈ మూవీలో ఎక్స్ పోజింగ్ కు ఎంత వరకు అవకాశం ఉందో అంత వరకు ఎక్స్ పోజ్ చేస్తూ ఈ మూవీ కోసం పూజ అన్ని విధాల సహకరించింది. ‘ముకుంద’ ‘ఒక లైలా కోసం’ సినిమాలలో చాల సాంప్రదాయంగా కనిపించిన పూజ ‘డిజే’ లో అందరి దృష్టిని ఆకర్షించడానికి బికినీతో మెరుపులు మెరిపించింది. 

అయితే ఆమె బికినీ లుక్ కు షాక్ అయిన సెన్సార్ వర్గాలు ఆ సీన్స్ ను బ్లర్ చేసినప్పటికీ పూజ నటించిన సీన్స్ కు మాస్ ప్రేక్షకుల నుండి ఈలలు వినిపిస్తున్నాయి. ఈ విషయాల పై మీడియా వర్గాలు పూజ ను ప్రశ్నిస్తే చాల విచిత్రమైన సమాధానం ఇచ్చి అందరి మైండ్ ను బ్లాంక్ చేసింది. 

సెన్సార్ వాళ్లు కట్ చేస్తారని బికినీ వేయకుండా ఉండలేం కదా అని అంటూ కథ డిమాండ్ చేసింది కాబట్టి బికినీ వేశాను భవిష్యత్తులో కూడా వేస్తా దీనిలో తప్పు ఏముంది అంటూ రివర్స్ లో పూజ హేహ్డే వేసిన ప్రశ్నలకు మీడియా ప్రతినిధులు ఆశ్చర్య పోయినట్లు టాక్. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా ఈ సినిమాలో పూజ చేసిన ఎక్స్ పోజింగ్ కు మరిన్ని భారీ ఆఫర్స్ రావడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.   
   
ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఐరన్ లెగ్ బ్యూటీగా పేరుపడిన పూజ హెగ్డే ఇప్పడు తన దురదృష్టాన్ని ‘దువ్వాడ’ మూవీకి కూడ అంటించింది అంటూ అల్లుఅర్జున్ అభిమానులు పూజ హెగ్డే ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ మొదలు పెట్టారు. అంతేకాదు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకున్న ‘దువ్వాడ’ ఏవరేజ్ హిట్ గా మారడం వెనుక పూజ దురదృష్టం కారణం అంటూ జరుగుతున్న ప్రచారం చూసి పూజ హెగ్డే కూడ ఆశ్చర్య పోతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: