లోఫర్ బ్యూటీ దిశా పటాని గుర్తుండే ఉంటుంది.. పూరి డైరక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆ సినిమాలో అమ్మడు హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తెలుగులో అంతగా సక్సెస్ అవ్వలేదు కాబట్టి అమ్మడికి ఇక్కడ అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో ఆల్రెడీ రెండు మూడు సినిమాలను తీసి హాట్ క్రేజ్ సొంతం చేసుకున్న దిశా పటాని ధోని అన్ టోల్డ్ స్టోరీలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.  


ఛాన్స్ దొరికితే ఆడియెన్స్ అటెన్షన్స్ ను తన మీద తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న దిశా లేటెస్ట్ గా జిక్యూ మేగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ ఇచ్చింది. దిశా అందాలు చూస్తే నిజంగా మతిపోతుందంటే నమ్మేయాలి. తన అందాల మత్తులో ఆడియెన్స్ ను ఊగిసలాడేలా చేస్తున్న దిశా సరైన ఛాన్స్ రావాలే కాని తానేంటో ప్రూవ్ చేస్తా అన్నట్టు ఉంది తన కాన్ఫిడెన్స్.    


ఇక చేసిన ఒక సినిమాతోనే టైగర్ ష్రాఫ్ తో ఎఫైర్ నడిపించేసిన అమ్మడు ఇంకా అతనితో టచ్ లోనే ఉంటుందని టాక్. ఛాన్స్ వస్తే సౌత్ లో అయినా సినిమాలు చేసేందుకు సిద్ధమే అంటూ చెప్పుకొచ్చిన దిశా ఈ రేంజ్ అందాలను వల్లిస్తుంటే ఇక అవకాశాలు రాకుండా ఉంటాయా చెప్పండి. 


ఫోటో షూట్లతో రెచ్చిపోతున్న దిశా ఈవెంట్ లలో కూడా అందరిని ఇంప్రెస్ చేస్తుంది. మరి బాలీవుడ్ ప్రేక్షకులేమో కాని సౌత్ ఆడియెన్స్ మాత్ర దిశా అందాలకు ఫిదా అయ్యారు. అంతేకాదు సౌత్ లో ఆమెకు పెరుగుతున్న క్రేజ్ చూసి ఇక్కడ దర్శక నిర్మాతలు కూడా దిశాకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట. త్వరలోనే ఆ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. మొత్తానికి తన అందంతో పడగొడుతున్న దిశా ఫోటో షూట్ లతో ఫుల్ క్రేజ్ తెచ్చేసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: