యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో వస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. 14 మంది కంటెస్టంట్స్ తో నడుస్తున్న బిగ్ బాస్ షో వారం ముందు తారక్ ఎంట్రీ ఎపిసోడ్ అదరగొట్టింది. ఇక వారం రోజుల్లో బిగ్ బాస్ లో ఉన్న హౌజ్ మెట్స్ వారి గొడవలతో నిరసనలతో ఏదో అలా నడిపించేశారు. బుల్లితెర ప్రేక్షకులు అంతగా ఎంజాయ్ చేయలేదు కాని వారాంతరం అదేనండి శని ఆదివారాల్లో వచ్చే తారక్ ఎపిసోడ్ కోసం మాత్రం ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుండటం జరిగింది. 


ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ కు ఓ నూతన ఉత్సాహం తెచ్చాడు తారక్. సినిమానే కాదు స్క్రీన్ ఏదైనా దుమ్ముదులిపేయడమే తారక మంత్రం అన్నట్టుగా బుల్లితెరలో బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న తారక్ అదరగొట్టేస్తున్నాడు. వారంలో హౌజ్ మెట్స్ చేసిన పనులు మంచి చెడులను వివరిస్తూ తారక్ చేసిన విశ్లేషణ అద్భుతం.


వారం రోజులుగా బిగ్ బాస్ మీద చాలా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఒకానొక దశలో అసలు ఇదేం రియాలిటీ షో అని ఆడియెన్స్ మహా హడావిడి చేశారు. అయితే ఫైనల్ గా తారక్ ఎంట్రీతో మళ్లీ ప్రోగ్రాంలో జోష్ మొదలైంది. ఇక మొదటి వారం ఇంటి నుండి బయటకు వచ్చేది ఎవరు అన్న విషయమై జరిగిన లడ్డూ కాన్సెప్ట్ కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. 


ఫైనల్ గా మధు ప్రియ, కత్తి కారిక, హరితేజ, జ్యోతి, కత్తి మహేష్ లు ఎలిమినేషన్ కు వచ్చారు. ఇక వారిలో మధు ప్రియ, కత్తి కార్తిక సేఫ్ జోన్ లోకి వెళ్లగా మహేష్ కత్తి, హరితేజ, జ్యోతి ఈ ముగ్గురిలో ఒకరు ఈరోజు ఎలిమినేట్ అవనున్నారు. మరి మహేష్ కత్తి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవుతాడని తెలుసు మరి ఎలిమినేట్ అయ్యేది అతనో కాదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: