తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఎంతగా అభిమానిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందటే చాలు తమిళ తంబీలు పండుగ చేసుకుంటారు. అంత గొప్ప ఫాలోయింగ్..ఇమేజ్ ఉన్న రజినీకి అల్లుడు హీరో ధనుష్. సూపర్ స్టార్ రజినీ కాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధనుష్. అయితే గత కొంత కాలంగా తమిళ ఇండస్ట్రీలో ధనుష్ పై తీవ్ర స్థాయిలో రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి.
ఆయన తల్లిదండ్రులను మేమే అంటు ఓ వృద్ద దంపతులు వచ్చారు..ఈ సీన్ కోర్టు వరకు వెళ్లింది. ఇక సుచి లీక్స్ తో ధనుష్ కెరీర్ ఆయోమయ పరిస్థితిలో పడిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ధనుష్ వి.ఐ.పి.2 సినిమా ప్రమోషన్ పనిలో ఉన్నాడు. ఈ సందర్భంగా ఓ తెలుగు చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో జర్నలిస్టు సుచీ లీక్స్ గురించి ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా కోపంగా అక్కడి నుంచి తమిళ నటుడు ధనుష్ బయటకొచ్చాడు.
అంతే కాదు మీరు సినిమా గురించి ఇంటర్వ్యూకి పిలిచారా..పర్సనల్ విషయాల గురించా అంటూ ప్రశ్నించాడు. సుచీ లీక్స్‌లో తమ గురించిన ఫొటోలు, వీడియోల వల్ల తన వైవాహిక జీవితం ఎలా ప్రభావితమైందని ప్రశ్నించగా `దిస్ ఈజ్ రియల్లీ స్టుపిడ్` అంటూ ధనుష్ ఇంటర్వ్యూను వాకౌట్ చేశాడు. గత మూడు నెలల క్రితం హీరో ధనుష్, అనిరుథ్ అనిరుధ్ రవిచంద్రన్‌లకు సంబంధించిన కొన్ని రహస్యాలను ఫొటోలు సుచిలీక్స్ ద్వారా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
![Related image](https://1.bp.blogspot.com/-Sq4gypx1-8c/WVClXXy53UI/AAAAAAAAGIQ/ycMOKj2xl_sMXKGL5ob4KX32pmpVRRkNwCLcBGAs/s1600/Velaiilla-Pattadhari-2-VIP-2-Tamil-movie-songs-2017.jpg)