సినీ నటీనటులపై వారి ప్రేమలపై అనేక రకాల పుకార్లు వస్తూనే ఉంటాయి. అయితే అందులో నిజానిజాలను ఎవరూ నిర్దారించలేరు. అయితే అందులో అభిమానులు పూర్తిగా నమ్మిన ప్రేమల్లో ముఖ్యమైన రూమర్ "నాటి అందాల రాశి మాధురీ దీక్షిత్ గ్రేట్ హీరో సంజయ్ దట్ ల ప్రేమ కథ" అసలు కథేమంటే:
ఇలాంటి ప్రేమ కథల ప్రేమాలయం బాలీవుడ్లో వివాదాస్పద విషయాలకు పెట్టింది పేరు సంజయ్ దత్. తెర వెనుక ఆయన మాదకద్రవ్యాలు వాడటం, అక్రమ ఆయుధాల కేసులతో సంచలనం సృష్టిస్తే, వెండితెరపై వెన్నెల బొమ్మ మాధురీ దీక్షిత్‌తో ప్రేమ విషయం కూడా సంచలం సృష్టించింది. వీరు కలసి నటించిన "సాజాన్" ఒక ప్రేమ ఉత్తుంగ తరంగం.
1990 ల్లో ఇద్దరూ సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమించుకున్నట్లు గుస గుసలు బాలీవుడ్ లో బాగా వినిపించాయి. అంతేకాదు ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మాధురీ, డాక్టర్ శ్రీరాం నేనే అనే అమెరికాలో నివసించే వరుణ్ణి పెళ్లిచేసుకుని అమెరికాలో కొంతకాలం ఉండి పోయింది. సంజయ్ మాత్రం అనేక కేసులతో జైళ్ళతో సహవాసం చేస్తూ మాన్యతాదత్ను వివాహం చేసుకున్నారు.
అనుకోకుండా ఇటీవల సంజయ్ దత్ గోవాలో జరిగిన ఒక సినిమా ఈవెంట్‌కి హాజరయ్యాడు. అక్కడి మీడియా ఆయనా పాతఙ్జాపకాలు గుర్తుచేస్తూ "ఇప్పుడు మీకు మరోసారి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటే ఎవర్ని పెళ్ళి చేసుకుంటారు?" అని ప్రశ్నించిందట. ఈ ప్రశ్నకి ఆయన ఏమాత్రం తడుముకోకుండా "మాధురీ దీక్షిత్" అని చెప్పాడట. ఆ తర్వాత తాను జోక్‌గా అలా అన్నానని వాతావరణాన్ని రిలాక్స్ చేస్తూ తనని తాను సమర్థించుకున్నారట. ప్రస్తుతం సంజయ్ "భూమి"’ చిత్రంలో నటిస్తున్నాడు.
ఆయన జీవితాధారంగా ఒక బయోపిక్ చిత్రం కూడా రాబోతోంది. ఇందులో రీల్ లైఫ్ సంజయ్గా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నాడు.