ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్నాయి. అయితే ఆ సినిమా ముహూర్తం మొదలు కలెక్షన్ల హంగామా పూర్తి అయ్యేంత వరకు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరడం సర్వ సాధారణం అయ్యింది. అయితే ఇది చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే పరిమితం అయ్యింది. తాజాగా ఈ జాబితాలోకి తాను చేరినందుకు చాలా గర్వంగ ఉందని అంటున్నారు విశ్వనటులు కమల్ హాసన్. అయితే ఈ వంద కోట్ల క్లబ్ వెనుక అసలు రహస్యం తెలిస్తే..నిజంగా షాక్ అవుతారు.
ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ లో ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్, టాలీవుడ్ లో ఈ ప్రోగ్రామ్ పెద్దగా వివాదాలు రాలేదు కానీ కోలీవుడ్ లో వస్తున్న బిగ్ బాస్ పై మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా తమిళ ‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ లో గత కొన్ని రోజుల నుంచి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గాయత్రీ రఘురాం మరో పార్టిసిపెంట్ ని పట్టుకొని ''అలాగా జన '' ప్రవర్తన అంటూ తిట్టడం పెద్ద సంచలనం రేపింది.
అయితే తమిళంలో జన అంటే నీచమైన తిట్టు కావడంతో పుతియ తమిళ గమ్ సంఘం బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా హెచ్చరికలు జారీ చేసారు. అంతే కాదు వారం రోజుల్లో కమల్ హాసన్, గాయత్రి రఘురామ్ లు పబ్లిక్ గా క్షమాపణలు చెప్పాలు, తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేదంటే వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
దీనిపై స్పందించిన కమల్ హాసన్ .. తాను కూడా 100 కోట్ల క్లబ్ లో చేరానంటూ చమత్కరించారు. ఏ భారతీయ నటుడు ఈ క్లబ్ లో చేరడానికి సాహసం చేయడనీ .. తనకి మాత్రమే ఆ అవకాశం దక్కిందని ఆయన అన్నారు. అంతే కాదు ఇప్పుడు కమల్ పై దావా వేస్తానన్న వ్యక్తి గతంలో 'సందియర్' టైటిల్ విషయంలోను కేసు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ, తాను డబ్బు కట్టడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.