తెలుగు బుల్లితెరపై మొట్ట మొదటి సారిగా ప్రపంచంలో ఎంతో పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ రియాల్టీ షో వస్తుంది. ఈ కార్యక్రమానికి తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన యంగ్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ ప్రోగ్రామ్ కి పెద్దగా ఆదరణ లభించలేదు..ఎందుకంటే ఇందులో ఉన్న కంటెస్టన్స్ ఫేడ్ ఔట్ అయిన వారు కావడమే. కానీ రాను రాను ఒక్కోక్కరూ ఎలిమినేట్ కావడం..బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మానసిక పరిస్థితి బాగాలేదని ఉన్నట్టుండి వెళ్లిపోవడం..ఆయన స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అందాల భామ దీక్షా పంత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
ప్రస్తుతం బిగ్ బాస్ నుంచి జ్యోతి, సంపూ, మధు ప్రియ, సమీర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. మొన్నటి వారం హీరో రానా కూడా బిగ్ బాస్ హౌజ్ లో సందడి చేశారు. ఈ సారి బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మరో బిగ్ బాస్ లోకి మరో కొత్త కంటెస్టంట్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ముమైత్ ఖాన్ అయితే తనకు ఫ్రష్ అబ్బాయి కావాలంటూ కామెంట్ చేయడం కూడా విశేషం. ఈ నేపథ్యంలో ‘జై’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హీరో నవదీప్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి బిగ్ బాస్ లో ఒక్క ప్రిన్స్ మాత్రమే యంగ్ బాయ్ గా ఉన్నాడు..ఇప్పుడు మనోడికి నవదీప్ తోడైతే ఆట ఎలా ఉంటుందో వేచి చూడాలి.
మరోవైపు నవదీప్ టాలీవుడ్ డ్రస్ కేసు విషయంలో సీట్ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే..అంతే కాదు ముమైత్ ఖాన్ కూడా సిట్ ముందు హాజరయ్యారు. ఇప్పుడు నవదీప్ టీవీ షో ల నిర్వహణలో అనుభవం వున్న నవదీప్ బిగ్ బాస్ హవుస్ లో ఏ మేరకు సందడి చేస్తారో చూడాలి.