తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఇమేజ్ సంపాదించిన ఇలయదళపతి విజయ్. ఇక విజయ్ సినిమా అంటే మొదటి నుంచి విపరీతమైన అంచనాలు పెంచుకుంటున్నారు తమిళ తంబీలు. నిజానికి విజయ్ హీరోగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటాడు. కష్టం వస్తే..ఎలాంటి వారికైనా సహాయం చేసే మనస్థత్వం ఉన్న వ్యక్తిగా తమిళనాట మంచి పేరు తెచ్చుకున్నాడు హీరో విజయ్.
తాజాగా హీరో విజయ్ మొట్ట మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'మెర్సెల్. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. సమంత, కాజల్, నిత్యామేనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలై సంచలనం సృష్టిస్తుంది.
తమిళనాట రజనీకాంత్ తర్వాత విజయ్ - అజిత్ లు అంతటి స్టార్ డం పొందిన విషయం తెలిసిందే. అందుకే అజిత్ - విజయ్ ల మధ్య భీకరమైన పోటీ ఉంటుంది. ఆ మద్య అజిత్ నటించిని వివేగం టీజర్ కూడా రికార్డులు స్థాపించింది.
తాజాగా విజయ్ నటించిన 'మెర్సెల్’ టీజర్ ఒక్క రోజుల్లోనే కోటి వ్యూస్ సాధించి పాత రికార్డుల ను బద్దలు కొట్టాడు విజయ్. మొత్తానికి అజిత్ రికార్డ్ ని విజయ్ బద్దలుకొట్టడం తో విజయ్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగులో ఈ చిత్రం అదిరింది పేరుతో రిలీజ్ కానుంది.