తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ. ఇప్పటి వరకు ఎన్నో సెన్సేషనల్ చిత్రాలు తీసినా..ఈ మద్య వర్మకు కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆ మద్య కిల్లర్ వీరప్పన్ తప్ప ఏ ఒక్క సినిమా హిట్ కాలేదు. ఇండస్ట్రీలో బయోస్కోపిక్ చిత్రాలు తెరకెక్కించడంలో వర్మ స్టైలే వేరు.
ఇప్పటికే పలువురి బయోస్కోపిక్ చిత్రాలు తెరకెక్కించారు. తెలుగు ఇండస్ట్రీలో మహానటులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోస్కోపిక్ చిత్రం తీస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్రంగా మారింది.
కాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో కీలకమైన ఎన్టీఆర్ రోల్‌ని విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ సరిపోతాడని, ఆయనను దాదాపుగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఓకే చేసినట్టు వార్తలొచ్చాయి. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీనిపై స్పందిచంని వర్మ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ ఫైనల్ చేయలేదని తెలిపాడు. త్వరలోనే డీటేల్స్ వెల్లడిస్తాడని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.