కోలీవుడ్ లో ఈ మద్య వివాదల మధ్య విడుదలైన చిత్రం మెర్సల్ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. జీఎస్టీపై ఘటన డైలాగ్ లు ఉండడంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ చిత్ర విడుదలను వ్యతిరేకించాయి. మెడిసన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయని డాక్టర్లు కూడా ఈ సినిమాను నిషేదించారు. ఆ నెగిటీవ్ లు సినిమాకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. కాగా, తన తాజా సినిమా 'మెర్సల్'కు అండగా నిలిచి.. సూపర్‌హిట్ చేసిన ప్రతి ఒక్కరికీ తమిళ సూపర్ స్టార్ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
విజయ్ విడుదల చేసిన ఈ ప్రకటనలో పైభాగంలో 'జీసెస్ సేవ్స్' అని రాసి ఉండటంతోపాటు ఎడమవైపున సీ జోసెఫ్ విజయ్, కుడివైపున ఆయన చిరునామా రాసి ఉండటం గమనార్హం. 'మెర్సల్' సినిమాపై బీజేపీ నేతల దాడి పెద్దగా ఫలించలేదు. కోలీవుడ్ మొత్తం విజయ్‌కు అండగా నిలిచింది. ఇటు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతూ ఘనవిజయాన్ని అందించారు.
మరోవైపు సినిమాలో చూపించింది మంచి విషయమే కదా! అంటూ కమల్ హాసన్, రజినీకాంత్ వంటి వారంతా మెర్సల్‌కి మద్దతు తెలిపారు.ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా మెర్సల్ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 170 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'మెర్సల్' ఆదరించిన అభిమానులకు, మిత్రులు, నటులు, నటీమణులు, వివిధ సంస్థలు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు అనేకమంది సినిమాకు మద్దతు పలికారని, ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆయన తన ప్రకటనలో తెలిపారు.
![ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు](https://telugu.filmibeat.com/img/2017/10/26-1508984600-mersal-3.jpg)