అల్లరి నరేష్ తో భీమినేని శ్రీనివాసరావు రూపొందిస్తున్న సినిమా సుడిగాడు. ఓకే టికెట్ పైన వంద సినిమాలు అంటూ వస్తున్న ఈ సుడిగాడు పూర్తిగా సెటైర్ల మీద రూపొందించినట్లు చిత్ర యూనిట్ చెబుతుంది. సినిమా ట్రైలయర్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కాగా, తాజాగా విడుదల చేసిన పోస్టర్స్, చేస్తున్న పబ్లిసిటీతో తెలుగు సినిమాలు, తెలుగు హీరోలతో సుడిగాడు ఓ రేంజ్ లో అడుకున్నట్లు అర్థమవుతుంది.
సుడిగాడు తన తాజా ప్రచారంలో.. ‘లాజిక్కుల్ని ఎవ్వరు నమ్మరు..అందరికీ మ్యాజిక్కులే కావాలి..’ (జులాయి సినిమాలో ఓ డైలాగ్)తో మొదలు పెట్టి తెలుగు హీరోలు ఒంటి చేత్తో ప్రపంచంలో ఉన్న అన్యాయాల్ని, అక్రమాల్నీ ఎదిరించగల సమర్థులై ఉంటారు, హీరోలు మొదటిసారి విమానం చూస్తున్నా.. అవరసమైతే దాన్ని నడిపే సామర్థ్యం కలిగి ఉంటారు.. ఇలా తెలుగు హీరోల గుణగణాలను వర్ణించారు.
అలాగే, ఈ ప్రచారంలో ‘టైటానిక్ షిప్ లో తెలుగు హీరో లేకపోవడం వల్లే అది మునిగింది. తెలుగు హీరో ఉండుంటే ఒంటి చేత్తో స్విమ్మింగ్ చేస్తూ.. మరో చేత్తో ఓడని ఒడ్డుకు చేర్చేవాడు.’ వంటి చమక్కులను పేల్చారు.
ఈ రకమైన పబ్లిసిటితో సుడిగాడు పై అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: