బాలీవుడ్ బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్ లో అందరి మనసు దోచిన కమెడియన్ భారతీ సింగ్(33). ఈమె ఎన్నో లైవ్ షోల్లో కామెడీ పండిస్తూ..ప్రముఖ సిని దిగ్గజాల వద్ద మెప్పును పొందారు. ద గ్రేట్ ఇండియా లాఫ్టర్ చాలెంజ్ , కామెడీ సర్కాస్, కామెడీ నైట్స్ బచావ్ ఇలా ఎన్నో కామెడీ ప్రోగ్రామ్స్ లో నవ్వులు పువ్వులు పూయించిన భారతి సింగ్ తనకు నచ్చిన వరుడిని పెళ్లి చేసుకుంది.
ట్విస్ట్ ఏంటంటే..హర్ష్ లింబ్చియా కన్నా భారతి సింగ్ ఏడు సంవత్సరాలు పెద్ద. వీరిద్దరి వివాహానికి గత జూన్‌లోనే నిశ్చితార్థం జరిగింది. డిసెంబరు 3న వివాహం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం గోవాలోని ఒక రిసార్ట్స్‌లో ఆనందోత్సాహల మద్య వీరి వివాహం జరిగింది. ఐదు రోజుల పాటు వివాహం చేయాలనుకున్నారు. ఈ నేపధ్యంలో నవంబరు 27న పంజాబీ సాంప్రదాయ రీతిలో వివాహ తంతు ప్రారంభమైంది.
29న భారతీ సింగ్ కుటుబ సభ్యులు, బంధువులు ముంబైలోని ఆమె ఇంటికి చేరుకున్నారు. 30న భారతి, హర్ష్ కుటుంబాల సభ్యులంతాకలిసి గోవా చేరుకున్నారు.
డిసెంబర్ 1న గోవాలోని అడోమా రిసార్ట్స్‌లో భారతి, హర్ష్‌లు తమ స్నేహితులకు, బంధువులకు పార్టీ ఇచ్చారు..2 న మెహందీ, 3న వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టీవీ నటులు హాజరయ్యారు. కమెడియన్ భారతీ సింగ్ పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొని పేరు సంపాదించారు.