టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్ గా మారి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది అందాల భామ మీనా. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మీనా..ఆ మద్య వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింద.  ప్రస్తుతం అత్త, అమ్మల పాత్రల్లో నటిస్తుంది.  మీనా 2009లో విద్యాసాగ‌ర్‌ని వివాహం చేసుకుంది. ఈ దంప‌తుల‌కి నైనిక అనే చిన్నారి 2011లో జ‌న్మించింది.
Image result for meena daughter nainika
నైనికని తేరి చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసింది. ఇళయదళపతి విజయ్, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తేరి చిత్రంలో విజయ్ కూతురిగా నైనిక నటించింది. దాదాపు 40 సీన్లలో కనిపించిన ఈ చిన్నారి తన నటనతో అందరి ప్రశంసలు అందుకుంది. మలయాళ చిత్రం భాస్కర్ ది రాస్కెల్ తమిళంలోకి రీమేక్ అవుతుండగా ఈ చిత్రంలో నైనిక కీలక పాత్ర పోషిస్తుంది.
Image result for meena daughter nainika
అరవింద్ స్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందుతుంది.  నైనిక ఏడో వసంతంలోకి అడుగుపెట్టి సందర్భంగా బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని మీనా కుటుంబ స‌భ్యులు రీసెంట్‌గా జ‌రిపారు. ఈ వేడుక‌కి రోజాతో పాటు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌య్యారు. చాలా సందడిగా జ‌రిగిన ఈ బ‌ర్త్‌డే వేడుక‌కి సంబంధించిన వీడియోని రోజా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: