‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ కు దుబాయ్ లో ఊహించని పెద్ద షాక్ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని దుబాయ్ వెళ్ళిన ‘సాహో’ టీమ్ కు అక్కడ పరిస్థుతులు అనుకూలించలేదు అన్న వార్తలు వస్తున్నాయి.
దాదాపు 40 కోట్ల ఖర్చుతో కళ్ళు చెదిరిపోయే యాక్షన్ సీన్స్ దుబాయ్ లో చిత్రీకరించాలని ‘సాహో’ టీమ్ కళలు కంటూ దుబాయ్ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈసినిమాకు ఈయాక్షన్ సీన్స్ కీలకం కావడంతో యాక్షన్ సిన్స్ తీయడంలో పేరుగాంచిన ప్రముఖ హాలీవుడ్ నిపుణులతో ఈటీమ్ ను సెట్ చేసి దుబాయ్ వెళ్ళినట్లు తెలుస్తోంది. సుమారు 75 రోజులపాటు ఈయాక్షన్ సీక్వెన్స్ తీయడానికి ‘సాహో’ టీమ్ ఏర్పాట్లు చేసుకునట్లు తెలుస్తోంది.
దీనికోసం గతవారం దుబాయ్ వెళ్ళిన ‘సాహో’ టీమ్ కు అనుకోని అవాంతరాలు ఎదురైనట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు దుబాయ్ లో ‘సాహో’ టీమ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరించాలి అని అనుకున్న కీలక ప్రదేశాలలో షూటింగ్ కు అక్కడ ప్రభుత్వం నుండి అనుమతులు రానట్లు తెలుస్తోంది. ‘సాహో’ టీమ్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ముందుకు సాగలేదు అని తెలుస్తోంది.
ఈకారణాలతో ఒక ప్రత్యకమైన టీమ్ ను ఈపనులనిమిత్తం దుబాయ్ లో ఉంచి మిగతా యూనిట్ సభ్యులు అంతా హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. దీనితో ‘సాహో’ యూనిట్ తమ యాక్షన్ ప్లాన్ ను మార్చుకుని జనవరిలో హైదరాబాద్ లో ఒకభారీ షెడ్యూల్ పూర్తిచేసి ఆతరువాత దుబాయ్ విషయం ఆలోచించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘సాహో’ షూటింగ్ అనుకున్న విధంగా జరగక పోవడంతో ఈమూవీ విడుదల 2019 లో మాత్రమే అన్నసంకేతాలు ఇప్పటికే వస్తున్నాయి..