హలో’ సినిమాను ప్రమోట్ చేస్తూ నాగార్జున ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ అఖిల్ కు షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాతగా నిర్మింపబడ్డ ఈసినిమాకు అఖిల్ ఎంత పారితోషికం తీసుకున్నాడు అంటూ ఒక మీడియా సంస్థ ప్రతినిధి నాగ్ ను కార్నర్ చేస్తూ అడిగిన ప్రశ్న పై నాగార్జున అఖిల్ ను ఇరుకున పెట్టె సమాధానం ఇచ్చాడు.

 

‘హలో’ కు సంబంధించి అఖిల్ కు ఒక్క రూపాయి కూడ పారితోషికంగా ఇవ్వలేదు అని అంటూ నాగార్జున ‘హలో’ హిట్ అయితే మాత్రం అఖిల్ కు 2కోట్లు ఇస్తాను అంటూ కామెంట్స్ చేసాడు. అయితే ఈ మొత్తం పారితోషికం గా కాకుండా అందమైన బహుమతి రూపంలో అని అంటూ నాగ్  అఖిల్ కు కండిషన్స్ పెడుతున్నాడు.

 

తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ కు ‘హలో’ విడుదల తరువాత ఒక ఇంపోర్టెడ్ కారును గిఫ్ట్ గా అందించబోతున్నాడట నాగార్జున. ప్రస్తుతం తండ్రికొడుకులు ఇద్దరూ ఈ సినిమా ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉండటంతో ఈ బహుమతి ఇచ్చే విషయాన్ని ‘హలో’ విడుదల తరువాత నాగ్ డిసైడ్  చేయబోతున్నాడు.

 

ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈసినిమాను ప్రమోట్ చేయడానికి అఖిల్ అమెరికా వెళ్లి సందడి చేస్తూ ఉంటే నాగార్జున ఇక్కడ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ‘హలో’ పై అంచనాలు పెంచడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అఖిల్ కెరియర్ కు ఎంతో కీలకంగా మారిన ఈ మూవీ రిజల్ట్ బట్టి  అఖిల్ భవిష్యత్ కెరియర్ ఉండబోతోంది అనేది వాస్తవం..

 


మరింత సమాచారం తెలుసుకోండి: