మహేష్ కెరియర్ లో కనీవినీ ఎరుగని ఫ్లాప్ ను చూసిన ‘స్పైడర్’ సినిమా గురించి అతడు మరిచిపోదామన్నా మరువనివ్వకుండా ఆ పీడకలను గుర్తు చేస్తూ ఇప్పటికీ తనను వెంటాడుతున్న సెటైర్లను తప్పించుకోలేక పోతున్నాడు. ఇటువంటి ఆసక్తికర విషయమే ఈమధ్య మళ్ళీ రిపీట్ అయింది. మహేష్ తన సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

ఈ బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ వల్ల మహేష్ కు ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలలో పారితోషికం లభిస్తోంది. దీనితో సినిమాలతో సంబంధం లేకుండా మహేష్ తన యాడ్స్ వల్ల వచ్చే ఆదాయాన్ని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాడు. ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా మహేష్ థమ్స్ అప్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ లేటెస్ట్ యాడ్ షూటింగ్ కోసం ఈమధ్య విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే.

 

ఎంతో కష్టపడి వెరైటీగా చేసిన ఈ యాడ్ ను మహేష్ తన ట్విటర్ ఎకౌంట్ లో తన అభిమానుల కోసం పోస్ట్ చేసాడు. ఈ యాడ్ చాల బాగుంది అంటూ మహేష్ అభిమానులు అభినందనలు తెలియచేస్తూ మధ్యలో ‘స్పైడర్’ మూవీ టేకింగ్ కన్నా ఈ యాడ్ టేకింగ్ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

దీనితో తనను ప్రశంసిస్తూ పెడుతున్న కామెంట్స్ లో కూడ ‘స్పైడర్’ ప్రస్తావన తీసుకు రావడం మహేష్ ను ఆశ్చర్య పరుస్తోంది అని టాక్. దీనినిబట్టి చూస్తుంటే మహేష్ అభిమానులు ‘స్పైడర్’ పరాజయాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్ధం అవుతుంది. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ‘భరత్ అనే నేను’ మహేష్ అభిమానుల అంచనాలు అందుకోలేకపోతే మహేష్ కు తన అభిమానుల నుంచి మరిన్ని తలనొప్పులు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే కాబోలు ఈమూవీ రిజల్ట్ గురించి మహేష్ టెన్షన్ పడుతూ కొరటాల శివను కూడ తెగ టెన్షన్ పడుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి..

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: