పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ విడుదల కాకపోవడం చిన్న సినిమాలకు పండుగగా మారింది. ముఖ్యంగా టాలీవుడ్ లో కొంతకాలం క్రితం ఒక వేలుగువేలిగిన దర్శకుడు తేజాకు ఈ వార్త తీపి వార్తగా మారి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలలో నాయకులు ఆడుతున్న అబద్దాలు విని విసుగు చెందుతున్న ప్రజలకు 1000 అబద్దాలు ఆడి హడావిడి చేయడానికి తేజా తన ‘1000 అబద్దాలు’ సినిమాతో వచ్చేస్తున్నాడు.

ఈ వీక్‌లో చాలా హాలిడేస్‌ రావడంతో పెద్ద సినిమాల విడుదలకి తగిన డేట్‌ అని ట్రేడ్‌ వర్గాలు ఎప్పట్నుంచో చెప్పుకుంటూ వచ్చాయి.  కానీ తెలుగులో పెద్ద సినిమాలు విడుదల చేసుకునే పరిస్థితులు లేవు. ఈ పరిస్థుతులలో చిన్న సినిమాలలో పెద్ద సినిమాగా వస్తున్న ‘1000 అబద్దాలు’ పై తేజ చాల ఆశ పెట్టుకున్నాడు. సినిమా ప్రారంభం నుంచి చివరకు 1000 నవ్వులు పూయిస్తాను అని తేజా గెరంటి ఇస్తున్న ఈ సినిమా హిట్ అయితే తేజ నుంచి మరికొన్ని మంచి హాస్య సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

చాలాకాలం తరువాత రమణగోగుల ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.సాయిరామ్‌ శంకర్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పుడు చాలా మంచి సీజన్‌ని సంపాదించింది. కష్టాల్లో ఉన్న తేజకి  ఈ సీజన్ లక్ ను తెచ్చి పెడుతుందో లేదో వేచిచూడాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: