గత మూడు నాలుగు నెలలుగా కత్తి మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య జరిగిన మాటల యుద్ధానికి ప్రతి తెలుగు ప్రేక్షకుడు బలైన సంగతి తెలిసిందే. ఏ ఛానెల్ పెట్టినా సరే అదే వివాదం రావడంతో ఈ ఇష్యూ చాలా పెద్దదైంది. న్యూస్ ఛానెల్స్ చుట్టూ తిరిగి నానా రభస చేసిన కత్తి మహేష్ పై నిన్న ఇద్దరు పవన్ అభిమానులు కోడి గుడ్లతో దాడి చేశారు.


ఈ ఘటనతో ఇంకాస్త హర్ట్ అయిన మహేష్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇక ఫైనల్ గా కత్తి మహేష్ తో సంధి కుదిర్చే క్రమంలో మహా న్యూస్ ఏర్పరచిన డిబెట్ సక్సెస్ అయ్యింది. ఈ డిబెట్ వ్యాఖ్యాతగా సీనియర్ జర్నలిస్ట్ మూర్తి వ్యవహరించగా.. జనసేన కార్యకర్త దిలీప్ సుంకర.. బిజెపి లీడర్ శేఖర్ పాల్గొన్నారు.


మహేష్ పై దాడి గురించి జనసేన తరపునుండి సమయనం పాటించండి అంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి. ఇక దీనితో కత్తి మహేష్ కాస్త మెత్త పడ్డాడు. అంతేకాదు జనసేన కార్యాలయం నుండి కత్తి మహేష్ స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయట. దీనితో తాను పెట్టిన కేసు కూడా వాపసు తీసుకున్నాడట.


ఇక స్టూడియో నుండి బయటకు రాగానే కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ తో కలిసి ఫిల్మ్ నగర్ రెస్టారెంట్ లో పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా కత్తి మహేష్ పవన్ అభిమానులుగా కాకుండా జనసేన కార్యకర్తల్లా పనిచేయాలని సందేశం కూడా ఇచ్చారని అంటున్నారు. పవన్ అభిమానులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సరే సమ్యనం పాటిస్తానని కత్తి మహేష్ అన్నారు. కొన్నాళ్లుగా హెడ్ లైన్ లో హైలెట్ అవుతూ వచ్చిన మహేష్ కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్ రగడకు మొత్తానికి ఫుల్ స్టాప్ పడినట్టే.    


మరింత సమాచారం తెలుసుకోండి: