![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/toliprmzziobyouteghw12345-415x250.jpg)
వచ్చే వారం విడుదల కాబోతున్న ‘తొలిప్రేమ’ సక్సస్ పైన మాత్రమే వరుణ్ తేజ్ కెరీర్ ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి ‘ఫిదా’ తో మంచి సక్సస్ వరుణ్ తేజ్ అందుకున్నప్పటికీ ఆ సక్సస్ అంతా సాయి పల్లవి శేఖర్ కమ్ముల క్రెడిట్ లోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.
దీనితో వరుణ్ తేజ్ అనేక లెక్కలు వేసుకుని పవన్ కళ్యాణ్ సినిమాలలో క్లాసిక్ గా పిలవబడే ‘తొలిప్రేమ’ టైటిల్ ను ధైర్యంగా తీసుకుని ఒక భారీ ప్రయోగానికి సిద్ధ పడుతున్నాడు వరుణ్ తేజ్. ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న వెంకీ అట్లూరి కొత్త దర్శకుడు కావడంతో అతడి క్రేజ్ బట్టి ఈసినిమాకు ఓపెనింగ్ కలక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు. కేవలం వరుణ్ తేజ్ మ్యానియాతో ఈసినిమాకు నిర్మాత కోరుకున్న భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం లేదు అని అంటున్నారు.
దీనికితోడు ఈమూవీ సాయి ధరమ్ తేజ్ ‘ఇంటలిజెంట్’ తో క్లాష్ అవ్వడం ఇప్పుడు మరింత గందరగోళంగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మెగా యంగ్ హీరోల పోటీని తప్పిద్దామని అల్లు అరవింద్ ఎన్నో ప్రయత్నాలు చేసినా దిల్ రాజ్ నిర్మాత సి. కళ్యాణ్ లకు గతంలో ఏర్పడిన కొంత గ్యాప్ వల్ల అనుకోకుండా ఈ మెగా యంగ్ హీరోస్ వార్ కు రంగం సిద్ధం అయింది అని అంటున్నారు.
ఇది
ఇలా ఉండగా సాయి
ధరమ్ తేజ్ తన ‘ఇంటిలిజెంట్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం రాజమండ్రిని ఎంచుకుంటే
వరుణ్ తేజ్ తన ‘తొలిప్రేమ’ సినిమా ప్రమోషన్ కోసం భీమవరంను ఎంచుకున్నట్లు వార్తలు
వస్తున్నాయి. ఈ నెల 3న భీమవరంలో ‘తొలిప్రేమ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా
చేయబోతున్నారు. మొత్తం సినిమా యూనిట్ అక్కడకు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఫంక్షన్ తరువాత పనిలోపనిగా గుంటూరు, విశాఖల్లోని కాలేజీల్లో కూడా
స్టూడెంట్ మీట్ లను వరుణ్ తేజ్ తన ‘తొలిప్రేమ’ కోసం నిర్వహిస్తాడట..