తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు నటి భానుప్రియ. కేవలం నటిగానే కాకుండా అధ్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్ గా మెప్పించారు. ఈమె 1967, జనవరి 15న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. భానుప్రియ సోదరి నిషాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమైంది. భానుప్రియ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, మరియు భరతనాట్యంలో శిక్షణ ఇస్తుంది.
భానుప్రియ వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలంతో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆ తరువాత తెలుగు అగ్ర హీరోలతో ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో నటించారు. భరత నాట్య కళాకారిణి సుమతీ కౌశల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇద్దరూ కళా రంగాలకు చెందినవారే కావడం.. కళారంగం పట్ల అమితమైన అభిమానం ఉండటంతో కుమార్తెకు 'అభినయ' అని పేరు పెట్టుకున్నారు.కుమార్తె పుట్టిన తర్వాత ఆదర్శ్ కౌశల్-భానుప్రియల వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2005లో భానుప్రియ ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు.భర్తతో విడాకుల అనంతరం భానుప్రియ తిరిగి ఇండియాకు వచ్చేశారు.
అప్పటినుంచి కుమార్తెతో పాటు చెన్నైలోనే ఉంటూ.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భాను ప్రియకు ఎక్కవగా సినిమా చాన్సులు రాలేదు.
తాజాగా నటి భానుప్రియ జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో అమెరికాలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న భానుప్రియ షాక్ కి గురయ్యారు..వెంటనే కుమార్తెను తీసుకుని ఆమె అమెరికా బయలుదేరి వెళ్లారు.