తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో అజిత్ కుమార్.  అచ్చమైన తెలుగు వాడైన అజిత్ తమిళ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను అజిత్ కి మంచి క్రేజ్ వుంది. ఇక ‘వీరమ్’ .. ‘వేదాళం’ .. ‘వివేగం ’ లాంటి సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు.  ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘విశ్వాసం’ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ మూవీలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉండ‌గా ఒక హీరోయిన్ గా న‌య‌న‌తార ను ఎంపిక చేశారు.
Image result for ajit kumar viswasam
గతంలో అజిత్ తో ‘బిల్లా’ చిత్రంలో నటించించి నయనతార.  అప్పట్లో నయనతారకు అంతగా స్టార్ డమ్ లేదు..కానీ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా నయనతార తన సత్తాను చూపుతోంది. అంతే కాదు దక్షిణాదిన ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటి కూడా నయన్ కావడం విశేషం. అయితే ఆమె స్టార్ డమ్ పెరిగిన తరువాత అజిత్ కలిసి చేస్తోన్న సినిమా ఇది.
Image result for ajit kumar viswasam
ఈ సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. అజిత్ కాంబినేషన్ అనే కాదు, తన పాత్ర కూడా బాగుండటంతోనే ఆమె డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.  మొదట ఈ చిత్రంలో నయన్ కి బదులుగా అనుష్క ను తీసుకోవాలనుకున్నారట.

కాకపోతే ఇప్ప‌టి వ‌ర‌కూ అనుష్క ఎటువంటి స‌మాధానం ఇవ్వ‌లేదు. ఒక వేళ ఆమె ఓకే అంటే ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ హీరోయిన్స్ ను ఒకే తెరపై చూసే అవ‌కాశం ప్రేక్ష‌కుల‌కు ద‌క్కుతుంది. మొత్తానికి తమిళ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు వున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: