రాజమౌళి... బాహుబలి అంటూ  తెలుగు సినిమాకి కరెన్సీ తో సన్మానం చేసి, ప్రపంచ సినీ సామ్రాజ్యంలో తెలుగు సినిమాకి సముచిత స్థానం అందించిన దిగ్దర్శకుడు. అలాంటి రాజమౌళి బాహుబలి 2 పూర్తి అయ్యి ఇంత కాలం అయినా ఎందుకు ఖాళీగా ఉన్నాడు? ఒక పెద్ద హిట్ కొట్టగానే మరో చిన్న సినిమా తీసి సూపర్ హిట్ ఇవ్వడం అలవాటుగా చేసుకున్న మన జక్కన్న ఇప్పుడు ఎందుకు తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయకుండా కామ్ అయిపోయాడు? రాజమౌళి తదుపరి చిత్రం ఇదే అంటూ రకరకాల రూమర్స్ వస్తున్నా జక్కన్న మాత్రం ఎందుకు వాటిపై స్పందించడం లేదు ? అన్న ప్రశ్నలు ఇప్పుడు పరిశ్రమలో బలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తదుపరి సినిమాకి  అడ్డంకి స్వయంగా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అని తెలుస్తుంది. 

Image result for ss rajamouli bahubali two

ఇది వరకే జక్కన్న, తారక్, చరణ్ ముగ్గురు కలసి దిగిన ఒక ఫోటో క్లిక్ వీరి కాంబో సినిమా ఉండబోతుంది అన్న న్యూస్ ని కన్ఫర్మ్ చేసేసింది . అది నిజం కూడా. అయితే వీరి సినిమా స్టార్ట్ కాకుండా అడ్డుకుంటుంది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే అన్న వార్త పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బాహుబలి 2  సక్సస్ తరువాత చాలా రోజులు ఆలోచించి తన కొడుకు రాజమౌళి కి ఒక చిన్న లైన్ వినిపించాడట విజయేంద్ర ప్రసాద్ .  ఆ పాయింట్ నచ్చిన రాజమౌళి తండ్రి మీద ఉన్న నమ్మకంతో తన తదుపరి సినిమాకి ఎన్టీఆర్ ని చరణ్ ని ఒప్పించేశాడు.

Image result for ss rajamouli bahubali two

 అయితే ఇప్పుడు విజయేంద్రప్రసాద్ ఆ పాయింట్ ని డెవలప్ చేస్తూ ఎన్ని వర్షన్స్  రాస్తున్నా అవేవి జక్కన్న ని సంతృప్తి పరచడం లేదట. ఒకానొక సమయంలో విజయేంద్రప్రసాద్ గారే ఇక నా వల్ల కాదు, బయట ఎవరి చేత అయినా స్క్రిప్ట్ ని డెవలప్ చేపించుకోమని చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా వచ్చేసిందట. సినిమా ఓపెనింగ్ రోజునాడే తన విజన్ తో టోటల్ సినిమాని చూసేసుకునే అలవాటు ఉన్న జక్కన్న..  ఇలా కధ కూడా కంప్లీట్ అవ్వకుండా అప్పుడే సినిమాని అఫిషియల్ అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు అని ఆగినటు తెలుస్తుంది. కాబట్టి ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ చరణ్ కూడా వేరు వేరు ప్రాజెక్ట్స్ కి కమిట్ అయిపోయారు. ఇప్పటికే ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఉంటుందా ? లేదా అన్న అనుమానాలు ఎక్కువ అవుతున్న ఈ సమయంలో అయినా.. రాజమౌళి త్వరగా ఈ మూవీ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తాడు ఏమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: