తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తన కెరీర్ కొనసాగించి...తమిళ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ జ్యోతిక. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న జ్యోతిక ఈ మద్య రీ ఎంట్రీ ఇచ్చింది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నాచియార్. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలపై ఇంతకు ముందే తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంపై చిత్ర యూనిట్ స్పందించి ఆ డైలాగ్స్ ని బీప్ చేశారు.
ఈ నేపథ్యంలో నాచియార్ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదల అయింది. తాజాగా నటి జ్యోతికపై హిందూ మక్కళ్ కట్చి నేతలు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. నాచియార్ చిత్రంలో జ్యోతిక ఒక సన్నివేశంలో ‘మాకు ఆలయాలయినా, చెత్తకుప్పలు అయినా ఒకటే’ అంటూ మాట్లాడిన సంభాషణలు హిందూ దేవాలయాలను అవమానించేవిగానూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే రిలీజ్ అయిన చిత్రంలో కొన్ని సంభాషనలు బీఫ్ చేసినా..కొన్ని సన్నివేశాలు మాత్రం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు జ్యోతిక తన కెరీర్ లో ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా వచ్చింది. నాచియార్ చిత్రం విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సినిమాలో ఆ సంభాషణలను వెంటనే తొలగించి, జ్యోతిక, దర్శకుడు బాలాపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.