యంగ్ హీరో విజయ్ దేవరకొండ ను యూత్ ఐకాన్ గా మార్చిన మూవీ అర్జున్ రెడ్డి ఈమూవీ ఘన విజయం తరువాత విజయ్ దేవరకొండ మోస్ట్ క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయాడు. అటువంటి క్రేజీ మూవీ ఛాయలతో నిండిన సినిమా వైపు యంగ్ హీరో నిఖిల్ అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా యంగ్ హీరో నిఖిల్  తాను నటించే సినిమాల కథల ఎంపికలో చాలా విభిన్నంగా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ విభిన్నమైన కథల ఎంపిక వల్ల నితిన్ సినిమాలకు వరస విజయాలు వస్తున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తునాయి. 
HERO NIKHIL IN KIRIK PARTY MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి సందర్భంలో నిఖిల్ లేటెస్ట్ గా నటిస్తున కిర్రాక్ పార్టీ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గలలో హడావిడి చేస్తోంది. సుధీర్ వర్మ డైరక్షన్ అనగానే జనాలకు గుర్తుకు వచ్చేది థ్రిల్లర్ జోనర్. కానీ అలాంటి డైరక్టర్ షాడో డైరెక్టర్ గా కిర్రాక్ పార్టీ మూవీకి వ్యహరించాడు అని వార్తలు వస్తున్నాయి. కిర్రాక్ పార్టీకి స్క్రీన్ ప్లే అందించింది సుధీర్ వర్మ అన్న సంగతి ఓపెన్ సీక్రెట్. అయితే ఈసినిమాకు  డైరక్షన్ వహించింది మటుకు చందు మొండేటి శిష్యుడు శరణ్. 
HERO NIKHIL IN KIRIK PARTY MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ సినిమా షూట్ లో దాదాపు అధిక భాగం సుధీర్ వర్మ పాల్గొన్నారని కన్నడ కిర్రాక్ పార్టీని తన అభిరుచి మేరకు మార్చి స్క్రిన్ ప్లే అందించడంతోపాటు దగ్గరుండి మిగిలిన వ్యవహారాలు కూడా నడిపించి ఈసినిమాను ఒక రీమేక్ లా కాకుండా  ఒక ఒరిజినల్ మూవీలా తీసాడని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కిర్రాక్ పార్టీ ఫస్ట్ హాఫ్ హ్యాపీడేస్ సినిమా మాదిరిగా యూత్ ఫుల్ గా ఉంటుందట. కానీ మాంచి ఇంటర్వల్ ట్విస్ట్ తో ఈ సినిమా తన రూట్ మార్చుకుని సెకండాఫ్ ‘అర్జున్ రెడ్డి’ మాదిరిగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. 
సంబంధిత చిత్రం
దీనికితోడు నిఖిల్ కూడా గెడ్డంతో కనిపిస్తూ  ఈమూవీలో ఆడ్ గా బిహేవ్ చేస్తు ‘అర్జున్ రెడ్డి’ ఛాయలతో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి.   దీనితో చందు మొండేటి అటు సుధీర్ వర్మల జాయింట్ ప్రాజెక్ట్ గా తెలుగు కిర్రాక్ పార్టీ మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈవారం కూడ థియేటర్స్ స్ట్రైక్ వల్ల ఏసినిమాలు విడుదల అవ్వని నేపధ్యంలో అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ వచ్చేవారం మార్చి 16న విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  రెండువారాల పాటు సినిమాలకు ప్రేక్షకులు ముఖం వాచిపోయిన నేపధ్యంలో వచ్చేవారం రాబోతున్న కిర్రాక్ పార్టీ మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం  ఉంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: