శ్రీ అమ్మ యంగేర్ అయ్యపన్ ఎవరో తెలుసా అని అడిగితె ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే సమాధానం తెలెయదు అనే, అదే మీకు శ్రీదేవి తెలుసా అని అడిగితె ఏ ఒక్కరి నోటి నుంచి కూడా తెలియదు అనే సమాధానం రాదు, ఎందుకంటె ఆ అందాల తార తెలియనివారు ఎవరుంటారు. ఆ అందాల తార అసలు పేరే శ్రీ అమ్మ యంగేర్ అయ్యపన్ కాని అందరికి శ్రీదేవి గానే తెలుసు.1963 ఆగష్టు 13 శివకాశి (తమిళనాడు) లో శ్రీదేవి జన్మించారు, ఆమె తల్లి రాజేశ్వరి తండ్రి అయ్యపన్ తండ్రి ఒక న్యాయవాది.

Image result for sridevi childhood pics

శ్రీదేవి తన చిన్న వయస్సు లోనే సినీ ఆరంగేట్రం చేసింది 1967లో కందన్ కరుణై అనె తమిళ చిత్రంలో అడుగుపెట్టింది .అప్పుడు ఆమె వయస్సు4 సంవత్సరాలు. శ్రీదేవి తెలుగులో మొట్టమొదటిగా 1970లో మా నాన్న నిర్దోషి అనే చిత్రంతొ బాలనటిగా ఆరంగేట్రం చేసింది . 1969 లో కుమార సంభవం అనే చిత్రం తో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. 1971లో విడుదలైన పూమ్పట్ట అనే మలయాళం చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా కేరళ స్టేట్ ఫిలిం అవార్డు అందుకుంది. కందంకర్నై(1967), నామ్ నాడు(1969), ప్రర్తనై(1970), బాబు(1971), బడిపంతులు(1972), బాలభారతం(1972), వసంతమలిగై (1972), భక్త కుంబర (1974) ఈ చిత్రాలన్నిటిలో బాలనటిగా గుర్తుండిపోయే నటనతో ఆకట్టుకుంది. 1972లో రాణి మేరా నాం అనే చిత్రంతొ బాలీవుడ లో కి అడుగుపెట్టింది. 1974లో భక్త కుంబర అనే చిత్రంతొ కన్నడ చిత్రసీమలో అడుగుపెట్టింది .

Image result for sridevi moondru mudichu

శ్రీదేవి 1976లో కే.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మూండ్రు ముదిచు అనే చిత్రంలో కధానాయికగా నటించింది. ఆ తరువాత కమలహాసన్ మరియు రజినీకాంత్ లతో వరుస చిత్రాలలో నటించింది.1977లో విడుదలైన గాయత్రీ , కవిక్కుయిల్, 16వయతినిలె ఘన విజయాలు సాధించాయి. 1978లో తెలుగులో విడుదలైన పదహారేళ్ళ వయస్సు చిత్రంలో కూడా కధానాయికగా నటించింది. ఆ తరువాత సిగప్పు రోజక్కల్, ప్రియ , కార్తీకదీపం, జానీ , వరుమయిన్ నిరం సివప్పు, ఆకలి రాజ్యం చిత్రాలలో నటించింది. N.T రామారావు తో 1979 లో వేటగాడు, 1980 లో సర్దార్ పాపారాయుడు , 1981 లో బొబ్బిలి పులి , జస్టిస్ చౌదరి మరియు ఆటగాడు చిత్రాలలో నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లతో పలు చిత్రాలలో నటించారు శ్రీదేవి. కృష్ణంరాజు- శ్రీదేవి కాంబినేషన్ లో వొచ్చిన త్రిశూలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే శోభన్ బాబు తో నటించిన దేవత చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈచిత్రం లో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇలా తొలితరం హీరోలతోనే కాకుండా, రెండోతరం హీరోలు నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వీరితో కూడా నటించి మెప్పించింది.

Image result for solva sawan movie

శ్రీదేవి 1979లో సోల్వ సావన్ అనే చిత్రంతో బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆతరువాత 1983లో హిమ్మత్వాల తో ఘనవిజయాన్ని అందుకుంది. 1984లో విదుదలైన తోఫా కూడా ఘనవిజయం సాదించింది, ఈ విజయంతో బాలీవుడ్ లో పెద్ద కధానాయికల వరుసలో చేరింది . ఆ తరువాత జీతెంద్ర – శ్రీదేవి కలసి 16 చిత్రాలలో నటించటం విశేషం . వాటిల్లో ఎక్కువ శాతం ఘన విజయాలు సాదించి ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయీ. ఆ తరువాత వరుస విజయాలతో బాలీవుడ్ లో No.1 హీరొయిన్ గా ఎదిగింది.

Related image

1986లో విడుదలైన నాగిన తో నటనకు పెట్టింది పేరుగా మారింది.1987లో ఆమె నటించిన mr.ఇండియా అత్యదిక వసూళ్ళు సాదించింది. ఇలా వరుస విజయాలు అందుకున్న ఆమె 1980 నుంచి 1990 వరకు ఎక్కువ పారితోషికం అందుకునె నటిగా వెలిగిపోయింది.1989లో వచ్చిన చాల్బాజ్ చిత్రంలో ద్వీపాత్రాభినయంతో అందరిని ఆకట్టుకోవటమే కాడుండా ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది. అదే సంవత్సరం 1989లో విడుదలిన చాంది చిత్రానికి గాను ఫిలింఫేర్ కి ఎంపికయ్యారు ఆమె. 1991లో యష్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన లంహి చిత్రంలో శ్రీదేవి అటు తల్లిగా ఇటు కూతురిగా ద్వీపాత్రాబినయంతో అలరించటమే కాకుండా ఉత్తమనటిగా తన 2వ ఫిలింఫేర్ అవార్డుని అందుకుంది.

Related image

1992లో ఖుదా గావః అనే చిత్రంలో అమితభ్ బచ్చన్ సరసన నటించి ఈ చిత్రానికి గాను మరొక్కసారి ఫిలింఫేర్ కి నామినేట్ అయింది ఆమె . ఇందులోనూ రెండు పాత్రలు పోషించింది, అలాగే గురు (1988), చాల్బాజ్ (1989), ఖుదా గావః (1992) మరియు గురుదేవ్ (1994) ఇలా పలు చిత్రాలలో ద్వీపాత్రాబినయంతో ప్రేక్షకులని అలరించింది. 1993లో విడుదలైన గుమ్రః అనె చిత్రానికి గాను మరొక్కసారి ఫిలింఫేర్ కి ఉత్తమనటిగా ఎంపికయ్యారు ఆమె. 1994లో లాడ్ల చిత్రానికి కూడా శ్రీ దేవి గారు ఉత్తమనటిగా ఫిలింఫేర్ కి ఎంపికయ్యారు. ఇలా తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంటూ ప్రేక్షకుల మదిలో గొప్ప స్థానాన్ని పొందగలిగారు శ్రీదేవి. 1996లో తిరిగి మరలా మలయాళం లో దేవరాగం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Image result for sridevi marriage photos

శ్రీదేవి గారు పెళ్ళికి ముందు చివరిగా నటించిన చిత్రం జుదై ఈ చిత్రం 1997లో విడుదలై ఆమెను మరొక్కసారి ఫిలింఫేర్ అవార్డ్స్ నామినేషన్ లో ఉంచింది. శ్రీదేవి ఆమె కెరీర్ గొప్ప స్థాయిలో ఉన్న సమయంలో 1996లో ఫిలిం ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని వివాహమాడింది. ఆ తరువాత ఇద్దరు పిల్లలకి తల్లిగా మారింది జనహ్వి (1997), ఖుషి (2000) ఈ క్రమంలో ఆవిడ కొంత కాలం సినిమాలకి దూరంగా ఉంది.

Image result for sridevi tv program

శ్రీదేవి గారు 6 సంవత్సరంల విరామం తరువాత 2004లో బుల్లి తెర మీద సందడి చేయటానికి తిరిగి మాలిని లయెర్ (2004 – 2005) కామెడీ షో తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తరువాత 2005లో కాబూమ్ అనే టీవీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు, ఆసియన్ అకాడమీ అఫ్ ఫిలిం అండ్ టెలివిషన్ లో మెంబెర్ గా కూడా వ్యవహరించారు. అదే విదంగా పలు టీవీ షోస్ లకు ప్రోగ్రామ్ లకు అతిధి గా కూడా విచ్చేశారు. 2012లో ఆమిర్ ఖాన్ టీవీ షో సత్యమేవ్ జయతే లో కూడా దర్శనమిచ్చారు. 

Related image

తిరిగి వెండి తెరకు 8 సంవత్సరాల తరువాత 2012లో ఇంగ్లీష్ వింగ్లిష్ అనే చిత్రం తో వచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాదించటమే కాకుండా శ్రీదేవి గారిఫై ప్రశంసల జల్లు కురిపించింది, అంతే కాకుండా ఈ చిత్రం తో ఫిలింఫేర్ కి కూడా ఉత్తమనటిగా ఎంపికయ్యారు శ్రీదేవి. ఆ తరువాత 2013లో విడుదలైన బొంబాయి టాకీస్ చిత్రంలో ఒక పాటలో కనిపించి ఆకట్టుకున్నారు, అలగే 2015లో వచ్చిన పులి చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించారు . 2015లో సిరోక్ ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ లో ultimate diva అవార్డు అందుకున్నారు. 2017లో తన ప్రొడక్షన్ లో మామ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు, ఆ చిత్రం చాల ప్రత్యేకమైనది ఎందుకంటే అది ఆవిడ 300వ చిత్రం, మామ్ చిత్రం విడుదలై విజయాన్ని సాదించింది అంతే కాకుండా 63వ ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఉత్తమనటిగా నామినేషన్ కూడా సంపాదించి పెట్టింది మామ్ చిత్రం. శ్రీదేవి చివరిగా నటించిన చిత్రం జీరో ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు ఇందులో ఆవిడ ఒక ముక్య పాత్ర పోషించారు ఈ చిత్రం తోరలోనే విడుదల కాబోతుంది తన అభిమానులు ఆమెను చూడగలిగే చివరి చిత్రం.

Image result for sridevi dead body

ఇలా ఎన్నో చిత్రాలు మరెన్నో సత్కారాలు, ఎన్నో పాత్రలు వాటిని పండించటానికి పడిన కష్టాలు, ఇలా ఆమె గురించి చెప్పుకునేందుకు ఇంకెన్నో విశేషాలు, వీటన్నింటిని భూలోకంలో వదిలేసి తానూ మాత్రం తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది ఆ అందాలతార, 24 february 2018 తన తుది శ్వాసని విడిచింది, ఆమె హటాత్ మరణం యావత్ భారతదేశానికే బాధాకరం.


మాటల్లో చెప్పలేని అందం ఆమె సొంతం, అభిమానుల హృదయాలలో చోటు ఆమె సొంతం, ఆమె ఇక లేదని జాలువారే ప్రతి కన్నీటి బొట్టు ఆమెకే సొంతం .


భూలోకాన ఉదయించిన ఓ అందాల తారా, అస్తమించావా భూలోకం నిద్రించు వేళా ! నీ అందాలు భూలోకానికి దూరం చేసేసి ఇలా, స్వర్గ లోకపు అందాలు వెతుక్కుంటూ నువ్వు అప్పుడే వెళ్ళిపొతే ఎలా?


ఆ విదంగా భూలోకాన ఉదయించిన అందాల తార అస్తమించి చేరింది ఆకాశ లోకాలని.

మరింత సమాచారం తెలుసుకోండి: