ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. 'ఒరు అదర లవ్' అనే మలయాళ సినిమాలోని 'మాణిక్య మలరయ పూవి' పాటలో ఆమె పలికించిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కన్నుకొట్టి ప్రపంచమంతా తన వైపు తిప్పుకునేలా చేసింది. సోషల్ మీడియా వల్లే తన వీడియో ప్రపంచమంతా చూస్తుందోని ప్రియా సంతోషం వ్యక్తం చేశారు. తమ సినీ పరిశ్రమ ఎదుగుదలకు ఈ ప్రచారం ఎంతో ఉపయోగపడిందని అన్నారు.
అయితే ప్రియా వారియర్ కి వరుసగా సినిమా చాన్సులు వస్తున్నాయి. టాలీవుడ్ లో మంచి విజయం సాధించిన 'టెంపర్' సినిమాను బాలీవుడ్ లో 'సింబా' పేరిట రణ్ వీర్ సింగ్ తో రోహిత్ శెట్టి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కరణ్ జోహర్ నిర్మాత కావడంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
చివరలో ఈ అవకాశం సయిఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఖాన్ కి దక్కింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి నటించే అవకాశం దక్కిందని కథనాలు వినిపించాయి. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించనున్న చిత్రం కోసం కథానాయికగా ప్రియా ప్రకాశ్ ఎంపికయ్యిందని వార్తలు వచ్చాయి.
కేవీ ఆనంద్ డైరెక్షన్‌లో సూర్య హీరోగా తెరకెక్కబోయే ఓ సినిమా కోసం చిత్రబృందం ప్రియను సంప్రదించింది. దీనికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పేసినట్టు సమాచారం. ఇక అధికారిక సమాచారం రావడమే తరువాయి.ప్రసిద్ధ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించనుంది. ఇప్పటికే సూర్య, కేవీ ఆనంద్ డైరెక్షన్‌లో అయాన్, మాత్రన్ అనే రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా మూడవది. ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
hero surya
priya prakash varrier
kv anand
nexe movie
ap politics
telangana politics
ap political updates
telugu political news
latest news
latest ap updates
political news
indian politics
international news
national news
tollywood news
bollywood news
kollywood news
hollywood news
tollywood
latest film news
latest updates