సోషల్ మీడియాలో మహేష్ బాబు ట్విటర్ ను మిగతా సోషల్ మీడియా ప్రమోషన్ ను మహేష్ టీమ్ చూస్తూ ఉంటుంది. అయితే మహేష్ బాబు వీరాభిమానులు కొంతమంది మహేష్ పేరుమీద ఫేస్ బుక్ ఎకౌంట్స్ ఓపెన్ చేసి అనేక ఫ్యాన్ పేజీలను అదేవిధంగా డిస్కషన్ బోర్డులను నిర్వహిస్తున్నారు. 
MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో మహేష్ వీరాభిమానులు కొంతమంది రాజమౌళిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం ఇలాంటి కామెంట్స్ రావడం వెనుక రాజమౌళి రీసెంట్ గా విడుదల చేసిన జూనియర్ చరణ్ ల మల్టీ స్టారర్ కు సంబంధించిన ‘ఆర్ఆర్ఆర్’ వీడియో.
MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్థుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈవీడియో మహేష్ అభిమానులకు మాత్రం తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. దీనికి కారణం గతంలో రాజమౌళి ‘బాహుబలి’ ని ప్రమోట్ చేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలలో భవిష్యత్తులో తాను మహేష్ తో తప్పకుండా ఒక్క సినిమాను తీస్తానని అయితే ఆసినిమాను ఎప్పుడు తీస్తానో చెప్పలేనని కానీ మహేష్ తో సినిమా తీయడం ఖాయం అని చెప్పాడు. 
RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఇప్పుడు రాజమౌళి తాను అన్న మాటలను మరిచిపోయాడు అంటూ మహేష్ అభిమానులు రాజమౌళికి ఆవిషయాలను గుర్తు చేస్తూ గతంలో రాజమౌళి ఈ విషయమై చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియోను కూడ జత చేస్తూ మాట తప్పిన రాజమౌళి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మల్టీ స్టారర్ లలో మహేష్ గురించి ఎందుకు ఆలోచించలేదు అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు అభిమానులు. దీనితో మహేష్ అభిమానుల అసహనం పై ఎదో ఒక రోజు స్పందించవలసిన పరిస్థితి రాజమౌళికి ఏర్పడింది అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: