ఎస్వీఆర్ ఎంత గొప్ప నటుడో తెలుగు సినిమాలను అభిమానించే వారందరికీ తెలుసు. అయితే మొదట్లో అవకాశాల కోసం ఎస్వీఆర్ ఎంతో కష్టపడ్డారన్న విషయం కొంత మందికే తెలుసు. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఎస్వీఆర్ మొదటగా వరూధిని అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఎస్వీఆర్ కు ఛాన్సులు రాలేదు. వరూధిని విడుదల తరువాత రెండు సంవత్సరాల పాటు ఎస్వీఆర్ ఎంతో కష్టపడ్డారు. అవకాశాల కోసం ఎంతో మందిని కలిశారు. మరెంతో మందిని సంప్రదించేవారు. అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడే వారు. ఇలా కష్టపడిన తరువాత షావుకారు సినిమాలో అవకాశం వచ్చింది. అందులో మంచి నటన కనబర్చడంతో తరువాత అదే బ్యానర్ లో పాతళభైరవి సినిమాలో మాంత్రికుడిగా అవకాశం వచ్చింది. ఇక అక్కడ నుంచి ఎస్వీఆర్ వెనుతిరిగ చూడలేదు.  అనేక సినిమాలలో నటించిన మహానటుడు గా ఖ్యాతి గడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: