‘రంగస్థలం’ తో రామ్ చరణ్ రికార్డులు క్రియేట్ చేస్తూ ఉండటంతో ఈరికార్డులను ఇదే కుటుంబానికి చెందిన అల్లుఅర్జున్ తన ‘నాపేరు సూర్య’ తో బ్రేక్ చేస్తాడు అని బన్నీ అభిమానులు ఆశపడుతున్నారు.  అల్లుఅర్జున్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నసందర్భంలో ఈవిషయాన్ని  చాలా ఘనంగా నిర్వహించాలని అల్లు కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. దీనికితోడు ఈనెల ఏప్రియల్ 8న బన్నీ 35వ పుట్టినరోజును జరుపుకోబోతున్న నేపధ్యంలో  ‘నాపేరు సూర్య’ యూనిట్ బన్నీని విష్ చేస్తూ ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసింది. 
 షాకిస్తున్న బర్త్ డే పోస్టర్
ఇప్పుడు ఈ బర్త్ డే పోస్టర్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈచిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రతి చిత్రంలో కమర్షియల్ అంశాలు ఉంటూనే తన పాత్రలో ప్రత్యేకత ఉండాలని బన్నీ భావించే నేపధ్యంలో ‘నా పేరు సూర్య’ చిత్రంలో బన్నీ ఒకకొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఈపరిస్థితులలో  తాజాగా విడుదల చేసిన బన్నీ బర్త్ డే పోస్టర్ అభిమానులలో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. 
నా పేరు సూర్య చిత్రంతో
ఈ పోస్టర్ లోని బన్నీ ముఖం పై ఇండియాలో ప్రధాన నగరాల పేర్లని పొందుపరిచారు.  దీనితో ఈసినిమా ద్వారా తాను కూడ ప్రభాస్ లా నేషనల్ స్టార్ గా మారబోతున్నట్లు బన్ని ఈపోస్టర్ ద్వారా సంకేతాలు ఇస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందా బోతున్న ఈమూవీలో ఫస్ట్ ఇంపాక్ట్ లోనే యాక్షన్ సన్నివేశాలని బలంగా చూపించి అభిమానుల్లో అంచనాలు పెంచేసాడు బన్నీ.  ఇది ఇలా ఉండగా ఈ చిత్ర ఆడియో వేడుక ఏప్రిల్ 15న నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది అని వార్తలు వస్తున్నాయి. 
15 ఇయర్స్ ఇండస్ట్రీ
ఆడియో వేడుక నిర్వహణకోసం హైదరాబాద్ వైజాగ్ మరియు తిరుపతి వంటి ప్రధాన నగరాలతో పాటు మెగా అభిమానులు విపరీతంగా ఉండే రాజమండ్రి పేరును కూడ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కుటుంబం కంటే దేశాన్నే ఎక్కువగా ప్రేమించే ఆర్మీ అధికారి కథను ఉద్వేగంగా ఈసినిమాలో దర్శకుడు వక్కంతం వంశీ చూపెడుతున్న నేపధ్యంలో ఈమూవీ ద్వారా తన ఇమేజ్ ని జాతీయస్థాయిలో పెచుకోవడానికి ఈమూవీని తమిళ మళయాళ హిందీ భాషలో డబ్ చేయబోతున్నారు. మరి ఈ బర్త్ డే ఫేస్ ఎత్తుగడ ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: