నందమూరి అభిమానులు అంతా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ గురించి ఎదురు చూస్తూ ఉంటే బాలయ్య మాత్రం ఒక సంచలనాత్మక సినిమాలో మోక్షజ్ఞకు వచ్చిన అవకాశానికి బ్రేక్ వేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక అతిథి పాత్ర మోక్షజ్ఞ తో చేయిద్దాము అని దర్శకుడు తేజ చేసిన సూచనను బాలయ్య తిరస్కరించినట్లు టాక్.
DIRECTOR TEJA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే ఈసినిమాలో నందమూరి యంగ్ హీరోలు నారా రోహిత్ తారక రత్నలకు పాత్రలను క్రియేట్ చేసిన తేజా ఇదే పద్ధతిని కొనసాగిస్తూ మోక్షజ్ఞను కూడ ఈ బయోపిక్ లో చూపెడతాను అని తేజ ఎంత బలవంత పెట్టినా బాలకృష్ణ అ ఒత్తిడికి అంగీకరించలేదు అని తెలుస్తోంది. అంతేకాదు మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ ఒక అతిథి పాత్రలో కాకుండా యంగ్ హీరోగా ఒక మంచి దర్శకుడుతో భారీగా ప్లాన్ చేయాలని తన ఉద్దేశ్యం అని బాలయ్య తేజాకు స్పష్టం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.  
సంబంధిత చిత్రం
మోక్షజ్ఞ ప్రస్తుతం నటనతోపాటు డాన్స్ ఫైటింగ్స్ గుర్రపుస్వారీ నేర్చుకుంటున్న సందర్భంలో ఈ శిక్షణ అంతా పూర్తి అయ్యాక 2019 లో మోక్షజ్ఞ సినిమాను అనౌన్స్ చేసి 2020 లో విడుదల చేయాలని బాలయ్య ఆలోచన అని అంటున్నారు. ఎటువంటి హంగామా లేని ఒక క్యూట్ లవ్ స్టోరీతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాలి అన్న ఉద్దేశ్యంతో అనేకమంది దర్శకుల పేర్లను బాలయ్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత చిత్రం
ఇది ఇలా ఉండగా ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో నటించమని మహేష్ పై ఒత్తిడి బాలయ్య తేజా ద్వారా చేయిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా జయలలిత పాత్రలో కాజల్ ను ఆనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీ వర్గాలలోని ప్రముఖుల పేర్లు అన్నీ బాలయ్య మనసులోకి వస్తూ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ల ప్రస్తావన ఈ బయోపిక్ కు సంబంధించి బాలకృష్ణ మనసులోకి కూడ రాకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: