తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు సూపర్ హిట్ చిత్రాలతో దూసుకు పోతున్నారు.  గత సంవత్సరం ఖైదీ నెంబర్ 150, ధృవ,దువ్వాడజగన్నాధం,ఫిదా,తొలిప్రేమ ఇలా మెగా హీరోలు నటించిన చిత్రాలు ఘన విజయం సాధించాయి.  ధృవ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ సాధించింది.  సుకుమార్, రాంచరణ్,సమంత కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ 1985 కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉండటంతో ఈ సినిమా చాలా మంది కొత్త అనుభూతికి లోనయ్యారు.
Image result for rangasthalam stills
రిలీజ్ అయిన మొదటి రోజే అన్ని కేంద్రాల్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల పరంగా కూడా దుమ్మురేపింది.  ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్లు సాధించింది.   రంగస్థలం చిత్రం తర్వాత నితిన్ ‘ఛల్ మోహన రంగ’, నాని ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రాలు వచ్చినా పెద్దగా హిట్ టాక్ రాకపోవడంతో ‘రంగస్థలం’ చిత్రానికి ప్లస్ పాయింట్ అయ్యింది. 
Image result for rangasthalam stills
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత నటించగా కీలక పాత్రల్లో జగపతి బాబు , ఆది పినిశెట్టి , అనసూయ , ప్రకాష్ రాజ్ లు నటించారు . మొత్తంగా 20 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 80 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
 Related image

ఏరియాల వారీగా రంగస్థలం షేర్ :

నైజాం – 24. 34 కోట్ల షేర్
సీడెడ్ – 15. 74 కోట్ల షేర్
కృష్ణా – 6. 35 కోట్లు
గుంటూరు – 7. 68 కోట్లు
ఈస్ట్ – 6. 85 కోట్లు
వెస్ట్ – 5. 44 కోట్లు
నెల్లూరు – 2. 99 కోట్లు
ఉత్తరాంధ్ర – 11. 52 కోట్లు
మొత్తం – 80 . 91 కోట్ల షేర్


మరింత సమాచారం తెలుసుకోండి: