చిరంజీవి నిర్వహించిన టాప్ హీరోల సమావేశానికి జూనియర్ రాకపోయినా ఆ సమావేశం ముగిసిన తరువాత వీరు ముగ్గురు ఒక ప్రముఖ హోటల్ లో కలిసిన విషయానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ముగ్గురు టాప్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కలిసి నవ్వుతూ తీయించుకున్న ఈ ఫోటో ఈముగ్గురు హీరోల అభిమానులకు పండుగగా మారింది.
అయితే ఆశ్చర్యకరంగా నిన్న రాత్రి చిరంజీవి నిర్వహించిన హీరోల సమావేశానికి రాని హీరోల సమావేశం ముగిసిన కొద్ది సేపటికే చరణ్ మహేష్ లను జూనియర్ ఎందుకు కలిసాడు అన్న విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హీరోల సమావేశ వివరాలను తెలుసుకోవడానికి జూనియర్ ఇలా చరణ్ మహేష్ లను కలిసాడు అని కొందరు అభిప్రాయ పడుతుంటే ‘భరత్ అనే నేను’ సక్సస్ తో జోష్ లో ఉన్న మహేష్ ఒక స్టార్ హోటల్ లో తన అత్యంత సన్నిహితుల కోసం ఇచ్చిన పార్టీకి జూనియర్ వచ్చాడు అని అంటున్నారు.
ఈ వార్తలలోని యదార్దాల పై క్లారిటీ లేకపోయినా ముగ్గురు టాప్ హీరోలు ఒకే యాంగిల్ లో ఇచ్చిన పోజుకు సంబంధించిన ఫోటో నేటి ట్రెండింగ్ ఫోటోగా మారింది. ప్రస్తుతం టాప్ హీరోలు అందరితో సాన్నిహిత్యం కొనసాగిస్తూ జూనియర్ తాను అందరివాడినీ అన్న సంకేతాలు వస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం వరస హిట్స్ తో దూసుకుపోతున్న జూనియర్ ను బాలకృష్ణ దూరం పెట్టినా ఆ విషయాలు పట్టించుకోకుండా అందరి హీరోలతో సన్నిహితంగా ఉంటూ ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగా కేవలం తన సినిమాల వైపే దృష్టి పెట్టి తన కెరియర్ కొనసాగిస్తున్నాడు జూనియర్. చిరంజీవితో మంచి సాన్నిహిత్యం ఉన్న జూనియర్ చిరంజీవి పిలుపుతో నిన్న జరిగిన హీరోల సమావేశానికి రాకపోయినా చరణ్ తో తన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ వ్యూహాత్మకంగా ఏ వర్గానికి చెందనివాడిగా తన ఎత్తుగడలు కొనసాగిస్తున్నడనుకోవాలి..