చాలామంది హీరోయిన్స్ మీకు నచ్చిన హీరోయిన్ ఎవరంటే శ్రీదేవి పేరో లేదా పాత తరం లోని సావిత్రి పేరో చెపుతూ ఉంటారు. కానీ డస్కీ బ్యూటీ అమలాపాల్ మాత్రం అనుష్క భజన చేస్తూ తాను అభిమానించే హీరోయిన్ అనుష్క అని చెప్పడమే కాకుండా అనుష్క తనను తన సొంత కూతురులా ‘బేబి’ అంటూ సంబోధిస్తూ తనను ఎంతో ముద్దుగా చూసుకుంటుందనీ చిన్న పిట్ట కధ చెపుతోంది. అమలాపాల్ మన యోగా సుందరితో ‘నాన్న’ సినిమాలో నటించినప్పటి నుంచీ వారిద్దరి మధ్యా పరిచయంతో పాటు ప్రేమ కూడా పెరిగిందట.

ఆ రోజునుంచి అనుష్క తనను ముద్దుగా బేబి అని పిలవడమే కాకుండా నటనకు సంబంధించిన అనేక టిప్స్ అలాగే యోగా వల్ల వచ్చే లాభాలు చెప్పడమే కాకుండా తనకు కనీసం రోజుకు ఒకసారైనా ఫోన్ చేసి పలకరిస్తుందని తను అడిగే అనేక ప్రశ్నలకు చాలా ఒప్పిగ్గా సమాధానం ఇస్తుందని అంటూ అనుష్క లో తాను అమ్మ మనసును చూశానని చెపుతోంది అమలాపాల్. సాటి హీరోయిన్ కనిపిస్తే ముఖం ముడుచుకునే హీరోయిన్స్ ఉన్న నేటి కాలంలో తాను అనుష్క లాంటి హీరోయిన్ నుని చూడలేదని సర్టిఫికేట్ ఇస్తోంది అమలాపాల్. ఇంతకీ ఈ బ్యూటీల ఇద్దరిమధ్య తల్లీ కూతుళ్ళ బంధం పదికాలాలు పాటు ఉండాలని కోరుకుందాం...

మరింత సమాచారం తెలుసుకోండి: