తెలుగు ఇండస్ట్రీలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘పెళ్లిచూపులు’ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ..సందీప్ వంగ దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం చిన్న దర్శక, నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరో అని ఫిలిం వర్గాల టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ చిత్రంతో నటించాడు..ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా..వాయిదాలు పడుతూ వస్తుంది.
అర్జున్ రెడ్డి సినిమాతో తాను ఏంటో నిరూపించుకోవడమే కాకుండా తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీలో ఒక రకంగా చెప్పాలంటే.. అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి అనేటటువంటి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా రౌడీ క్లబ్ ఏర్పాటు చేయడం ద్వారా సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తాను ప్రత్యేకమే అని మరోసారి నిరూపించుకున్నాడు.
తాజాగా ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ అయిన విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ విజయ్ దేవరకొండనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. చిరంజీవి, వెంకీ, బాలయ్య బాబు వంటి బిగ్ స్టార్స్‌తో కలిసి ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ అవడంపై ఆనందం వ్యక్తంచేస్తూ అభిమానులకు ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.