హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరంగా తీర్చిదిద్దబడింది..సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు హైదరాబాద్ బిర్యానీ అంటే పడిచస్తారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ బిర్యాని ప్రపంచ దేశాల్లో ప్రసిద్ది చెందింది. ఇక హైదరాబాద్ వచ్చిన విదేశీ పర్యటకులు కానీ..షూటింగ్స్ కోసం వచ్చే సినీ ఇండస్ట్రీ వర్గానికి చెందినవారు కానీ ఇక్కడి బిర్యానీ రుచి చూడాల్సిందే..మళ్లీ రావాలని అనుకోవాల్సిందే. అంతే గొప్ప హైదరాబాద్ బిర్యానితో హాట్ బ్యూటీ రకూల్ ప్రిత్ సింగ్ బాలీవుడ్ సెలబ్స్ ని రంజింపజేసింది.
అసలు విషయానికి వస్తే.. తెలుగు లో మొన్నటి వరకు టాప్ హీరోల సరసన నటించి బిజీ బిజీగా గడిపిన ఈ అమ్మడికి ప్రస్తుతం సినిమా ఛాన్సులు బాగా తగ్గాయనే చెప్పొచ్చు. మహేష్ బాబు స్పైడర్ తర్వాత రకూల్ నటించిన సినిమాలు పెద్దగా రాలేదు. అంతే కాదు ఈ అమ్మడి దృష్టి ఇప్పుడు బాలీవుడ్ పై పడింది..అజయ్‌దేవగన్‌తో ఓ సినిమా చేసేసింది కూడా! అయితే ఈ షూటింగ్ సమయంలో రకూల్ ప్రీత్ ని కొంత మంది హైదరాబాద్ బిర్యాని విశిష్టత తెలుసుకొని తమకు ఆ బిర్యాని తినాలనే కోరిక ఉందని అన్నారట.
ఇంకేముంది..వారి కోరికను కాదనకుండా తన తమ్ముడితో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మటన్ బిర్యానీ తయారు చేయించి తెప్పించి అందరికి పార్టీ ఇచ్చిందట. పనిలో పనిగా మరికొందరికి కూడా హైదరాబాద్ బిర్యాని రుచి చూపించిందట..అయితే దీనికి వెనుక మరో కారణం కూడా ఉందట.
ప్రస్తుతం తాను బాలీవుడ్ లో స్థిరపడాలనే కోరిక ఉండటంతో..ఇప్పటి నుంచే అక్కడ సెలబ్స్ ని బిర్యానీతో కాక పట్టేసిందని అంటున్నారు. ఇదంతా స్నేహం కోసం చేస్తున్నట్టు రకూల్ చెబుతున్నా అవకాశాల కోసమే అని కొందరు బాలీవుడ్ జనాలు అంటున్నారు. మొత్తానికి బిర్యానీతో అందరినీ ఒకేసారి కాకపట్టే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని కూడా అంటున్నారు.