![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/teja... -415x250.jpg)
తేజ సుమారు పది సంవత్సరాల తరువాత దగ్గుబాటి రానా తో సినిమా తీసి హిట్ కొట్టినాడు. ఆ హిట్ తో తేజ కు అవకాశాలు బాగా వచ్చినాయి. వెంటనే ఎన్టీఆర్ బయో పిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయినాడు. వెంకీ తో సినిమా కూడా కుదిర్చికున్నాడు. అయితే ఇప్పడు ఈ రెండు సినిమా లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇలా షార్ట్ గ్యాప్ లో రెండు సినిమా లను మిస్ చేసుకున్నాడు.
ఇప్పడూ తాజాగా తేజ ఏం చేస్తున్నాడని మీకు సందేహం రావొచ్చు. ప్రస్తుతం తేజ దగ్గర 3ప్రాజెక్టులున్నాయి. వీటిలో ఏది వర్కవుట్ అవుతుందో అతడు కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి.నిర్మాత డీవీవీ దానయ్య, తన కొడుకును హీరోగా పరిచయం చేసే బాధ్యతను తేజకు అప్పగించినట్టు తెలుస్తోంది. గతంలో నితిన్, నవదీప్, ఉదయ్ కిరణ్ లాంటి హీరోల్ని వెండితెరకు పరిచయం చేసిన తేజ, ఇప్పుడు దానయ్య కొడుకును హీరోని చేసే పనిలో ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు నానితో కూడా ఓ సినిమా చేసే ప్లాన్స్ లో తేజ ఉన్నట్టు టాక్. ఈ మేరకు నల్లమలపు బుజ్జి రిఫరెన్స్ తో నానిని కలిసి స్టోరీ వినిపించాడట తేజ. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్టు సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇవన్నీ పక్కనపెడితే.. రానాతోనే మరో సినిమా వర్కవుట్ అయ్యేలా ఉందని స్వయంగా తేజ ప్రకటించాడు. సో.. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ 3 ప్రాజెక్టుల్లో ఏదో ఒకటి ఫైనల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.