గత కొద్ది రోజులుగా రానా ఆరోగ్యం పై మీడియాలో విపరీతమైన వార్తలు వచ్చిన నేపధ్యంలో రానా ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారి తన ఆరోగ్యం పై వస్తున్న వార్తల పై పెదవి విప్పాడు. తన అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ తనకు ప్రస్తుతం బ్లడ్ ప్రెషర్ సమస్యలు కొనసాగుతున్నాయని అందువల్ల తన కంటి సర్జరీ ఆలస్యం అవుతోందని క్లారిటీ ఇచ్చాడు.
అంతేకాదు చాల మీడియా సంస్థలు కథనాలు వ్రాస్తున్నట్లుగా తనకు ఎటువంటి కిడ్నీ సమస్యలు లేవనీ తనకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి కాకుండా వేరే కొత్త అనారోగ్య సమస్యలు తనకు సృష్టించడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. అదేవిధంగా తన అనారోగ్య సమస్యల గురించి రహస్యాలు దాచవలసిన పరిస్థితి తనకు లేదు అంటూ తన ఆరోగ్యం గురించి అసలు విషయాలు జనానికి తెలిస్తే తనకు అవకాశాలు ఏమీ తగ్గిపోవు అంటూ సెటైర్లు వేసాడు రానా.
ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ ను పూర్తిచేసే పనిలో తాను తరుచూ హైదరాబాద్ ముంబాయ్ పట్టణాల మధ్య తిరుగుతున్న విషయాలను తెలియచేస్తూ తాను కనిపించకపోయేసరికి ఏవో విషయాలు ఊహించుకుని మీడియా వార్తలు రాస్తోంది అంటూ జోక్ చేసాడు. ఆఖరికి కొద్ది రోజుల క్రితం జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్ ఫంక్షన్ కు తాను కొద్దిగా ఆలస్యంగా వెళితే తన ఆరోగ్యం గురించి ఆ ఫంక్షన్ లో ఖంగారు పడిపోయి మాట్లాడుకున్న విషయం కూడ తనకు తెలుసు అంటూ జోక్ చేసాడు.
ప్రస్తుతం తాను నటిస్తున్న ‘హాతీ మేరా సాతీ’ కేరళ అడువులలో జరగవలసిన నేపధ్యంలో వర్షా కాలంలో వానలు ఎక్కువగా ఉంటాయని ఆ మూవీ షూటింగ్ వాయిదా వేస్తే ఆ విషయాన్ని కూడ తన ఆరోగ్యంతో లింక్ చేసి వార్తలు వ్రాయడం తనను మరింత షాక్ ఇచ్చింది అని అంటున్నాడు. ఇప్పుడు తన దృష్టి అంతా తన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ గురించి మాత్రమే అని అంటూ తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేసాడు..