జబర్ధస్త్ కామెడీ షో తో పరిచయం అయిన యాంకర్ రష్మి అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అంతకు ముందు హాట్ యాంకర్ అనసూయ ‘జబర్ధస్త్’కామెడీ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలో మంచి పాపులారిటీ సంపాదించింది. దాంతో వివిధ ఛానల్స్ లో బాగా బిజీ కావడంతో జబర్ధస్త్ కి గుడ్ బాయ్ చెప్పింది. ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన రష్మి గౌతమ్ కూడా అనసూయ ను మించి పోయింది. ఈ అమ్మడికి ఏకంగా నాలుగైదు సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కూడా వచ్చింది.
కాకపోతే రష్మీ హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయింది..ఎంత గ్లామర్ షో చేసినా ఈ అమ్మడిని పట్టించుకోలేదు తెలుగు ప్రేక్షకులు. దాంతో జబర్ధస్త్ కామెడీలో యాంకరింగ్ చేస్తూనే..ఇతర ఛానల్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. ఇక బుల్లితెరపై రష్మీ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది సుదీర్. జబ్బర్ధస్త్ లో వీరిద్దరి పరిచయం వేరే ప్రోగ్రామ్స్ లో కూడా కలిసి చేయడం ఓ ప్రత్యేకత చాటుకుంది. ఇటీవల ప్రసారం అయిన ఓ షోలో వారిద్దరూ సరదాగా పెళ్లి చేసుకున్నట్లు కూడా చూపించారు.
కాగా, ట్విట్టర్లో ఓ అభిమాని రష్మీకి ఓ సలహా ఇచ్చి కోపం తెప్పించాడు. 'సుధీర్‌ని పెళ్లి చేసుకో.. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు.. మీ కెరీర్ కోసం కష్టపడి పని చేస్తున్నారు'.. అని ఓ అభిమాని రష్మీకి ఉచిత సలహా ఇచ్చాడు. అభిమాని ట్విట్ కి స్పందించిన రష్మీ..'మేము స్క్రీన్‌పై నటిస్తుండగా మాత్రమే మీరు చూశారు.. ఆ మాత్రానికే మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు?.. రియల్ లైఫ్, రీల్ లైఫ్ లని వేర్వేరుగా చూడడం నేర్చుకోండి.
మేము స్క్రీన్‌పై చేసేదంతా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే. మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మాకు సంబంధించిన విషయం. మాకు మీ నుంచి ఎటువంటి సూచనలు అవసరం లేదు' కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఆ మద్య రష్మి, సుధీర్ కి పెళ్లి అయినట్లు వార్తలు కూడా తెగ హల్ చల్ చేశాయి.