తెలుగు తెర జక్కన్న దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమాను టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారి ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. అయితే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు రోజుకు ఒకటి వెబ్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ఈ సినిమా ఒక ప్రముఖ హాలీవుడ్ సినిమాకు అనుసరణ అని వార్తలు వస్తే, రాజమౌళి ఆ వార్తలను ఖండించాడు. ప్రస్తుతం నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా 1955లో వచ్చిన ఎన్టీఆర్ నిర్మించిన ‘జయసింహ’ సినిమాకు అనుసరణ అని వార్తలు వినబడుతున్నాయి.

ఈ వార్తలను ప్రచారం చేసే వాళ్ళు తమ వాదానికి బలం చేకూర్చే విధంగా కొన్ని ఉదాహరణలు కూడా చూపెడుతున్నారు. ఈ సినిమాలో హీరో పాత్ర పోషించిన నందమూరి తారకరామారావుకు, విజయసింహ అనే తమ్ముడు ఉంటాడు. ఈ విజయసింహ, జయసింహకు స్వయానా పినతండ్రి కొడుకు, ఈ పాత్రను ఆ సినిమాలో కాంతారావు పోషించాడు. విజయంసింహ తండ్రి రుద్రమ సింహ (ఎస్వి రంగారావు) తన కొడుకును రాజును చేయడానికి ఎటువంటి వైపరీత్యాలు సృస్టించాడు, ఆ సమస్యలను ఎదుర్కుని రాజు జయసింహ తన రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడు అనేది కధ ఇది ఆ రోజులలో సూపర్ హిట్ మూవి.

 ప్రస్తుతం రాజమౌళి నిర్మిస్తున్న సినిమాలలో కూడా ప్రభాస్ రాణా లు అన్నదమ్ములుగా నటించడమే కాకుండా తన అన్న ప్రభాస్ ను రాజ్యాధికారానుండి దింపేసి రాజు అవుదామని రాణా చేసే ప్రయత్నాలకు ప్రభాస్ ఎలా ప్రతిస్పందించాడు అన్నది మూల కధ. అయితే  ‘జయసింహ’ సినిమాలో పినతండ్రి విలన్ ఈయన కొడుకు విజయసింహ మంచివాడు దీనికి వ్యతిరేకంగా ‘బాహుబలి’ సినిమాలో పినతండ్రి మంచివాడు ఈయన కొడుకు విలన్ ఈ మార్పులతో రాజమౌళి తన క్రియేటివిటీని జతచేసి “బాహుబలి”  సినిమాను నడిపిస్తున్నాడని ఫిలింనగర్ లేటెస్ట్ టాక్...      

 

మరింత సమాచారం తెలుసుకోండి: