సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ నయనతార.  ఈ సినిమాలో చీరకట్టుతో సాంప్రదాయంగా కనిపించింది.  సూర్య నటించిన ‘గజిని’ సినిమాలో చాలా హాట్ గా కనిపించింది ఒక్కసారే స్టార్ ఇమేజ్ పెంచుకుంది.   అప్పటి నుంచి తెలుగు, తమిళ, మళియాళ భాషలో నటిస్తుంది. కథానాయికగా నయనతార అరంగేట్రం చేసి పదిహేనేళ్లు పూర్తయ్యాయి.
Image result for kamal hassan
సుదీర్ఘ ప్రయాణంలో దక్షిణాదిలోని ఎందరో అగ్ర హీరోల సరసన నటించిన ఆమె ఇప్పటివరకు కమల్‌హాసన్‌తో మాత్రం సినిమా చేయలేకపోయింది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో కమల్ హాసన్ తో ఒక్కసినిమా చేయలేదని తెగ బాధపడిపోయిందట.  భారతీయుడు సీక్వెల్‌తో తొలిసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇండియన్-2 పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నారు.
Image result for shankar kamal bharatiyudu
ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోని లోతుపాతుల్ని ఆవిష్కరిస్తూ పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలిసింది. ఇందులో కమల్‌హాసన్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌కు జోడీగా నయనతార నటించనున్నట్లు సమాచారం.  ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకొని ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: