మెగా డాటర్ నిహారిక యంగ్ హీరో సుమంత్ అశ్విన్ లు జంటగా నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ మూవీ ప్రీ లాంచ్ ఫంక్షన్ నిన్న ఘనంగా జరిగింది. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు ఎందరోపాల్గొన్న ఈఫంక్షన్ లో ముఖ్యఅతిథిగా వచ్చిన చరణ్ గతంలో చిరంజీవి మెగా స్టార్ కాకముందు 5వేల రూపాయల కోసం పడిన పాట్లను గురించి వివరిస్తూ ఒక ఆసక్తికర విషయాన్ని తెలియచేసి అందరికీ షాక్ ఇచ్చాడు.
1980 ప్రాంతాలలో చిరంజీవికి ఒకానోక సందర్భంలో 5వేలు అవసరం వచ్చిందట. అప్పటి పరిస్థుతులకు చిరంజీవికి ఆ 5వేలు పెద్ద మొత్తం కావడంతో అప్పట్లో చిరంజీవి హీరోగా చేస్తున్న సినిమాల నిర్మాతలకు ఫోన్ చేసి అడిగాడట. అయితే ఆ నిర్మాతలు అంతా ఏవో రకరకాల కారణాలు చెపుతూ చిరంజీవి అడిగిన డబ్బు ఇవ్వకుండా సమాధానం దాటవేసారట.
దీనితో చేసేది లేక చిరంజీవి అప్పటికే ప్రముఖ నిర్మాతగా పేరు గాంచిన ఎమ్.ఎస్. రాజ్ కు ఫోన్ చేసి తనకు ఏర్పడ్డ 5వేల అవసరం చెపితే చిరంజీవి ఎమ్.ఎస్.రాజ్ తో సినిమాలు చేయకపోయినా తన తండ్రి అడిగిన డబ్బు తెచ్చిఇచ్చి అప్పట్లో తమ కుటుంబానికి ఏర్పడ్డ అవసరాన్ని ఆదుకున్నాడు అన్న విషయాన్ని బయటపెట్టి ఎమ్.ఎస్. రాజ్ గొప్పతనాన్ని చరణ్ వివరించాడు. అటువంటి ఎమ్.ఎస్. రాజ్ కొడుకుగా హీరోగా నటిస్తున్న సుమంత్ అశ్విన్ తన కుటుంబానికి ఉన్న మంచి పేరుతో ఖచ్చితంగా ఈ ‘హ్యాపీవెడ్డింగ్’ ద్వారా సక్సస్ ఫుల్ హీరోగా మారుతాడు అంటూ కామెంట్స్ చేసాడు.
ఇదే సందర్భంలో చరణ్ మాట్లాడుతూ ఏవ్యక్తికైనా సమర్ధత కంటే మంచితనం చాల అవసరం అని అంటూ మంచితనం లేకుండా సమర్ధత ఉన్నా ఆవ్యక్తి రాణించదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. మంచితనంతో పాటు కష్టపడే తత్వం ఉన్న సుమంత్ అశ్విన్ నిహారికలు నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ హిట్ అవుతుంది అంటూ తన అభినందనలు తెలియచేసాడు మెగా పవర్ స్టార్. నిహారిక సుమంత్ అశ్విన్ లకు ఎంతో కీలకమైన సక్సస్ ను ఈ ‘హ్యాపీ వెడ్డింగ్’ ఎంత వరకు అందిస్తుందో ఈవారం తేలిపోతుంది..