తెలుగు ఇండస్ట్రీలో ‘ఝుమ్మందినాథం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ.  ఆ తర్వాత  ఈ అమ్మడు నటించిన ఏ చిత్రాలు పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాల్లో నటించిన తాప్సికి ఆందాలు ఆరబోసినా పెద్ద ఫలితం రాలేదు.  ఆ మద్య హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో దర్శకుడు, నటుడు లారెన్స్ తెరకెక్కించిన గంగా చిత్రంలో మంచి పేరు వచ్చింది.  ఆ చిత్రం కూడా తాప్సీకి పెద్దగా కలిసి రాలేదు.  ప్రస్తుతం బాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది.  ఆ మద్య తెలుగు లో నటించిన ‘ఆనందో బ్రహ్మ’ మనుషులకు దెయ్యాలు భయపడే డిఫరెంట్ కాన్సెప్ట్ తో మంచి ఆదరణ పొందింది.
Image result for adhi neevevaro movie
ప్రస్తుతం తాప్సీ  ‘నీవెవరో’చిత్రంలో నటిస్తుంది.    తాజాగా నటి తాప్సీకి ట్విట్టర్ వేధికగా ఘోర అవమానం జరిగింది.    ‘ తాప్సి బాలీవుడ్‌లో కెల్లా చెత్త నటిలా అనిపిస్తుంది.  ఇంకోసారి నేను ఆమెను చూడాలనుకోవడం లేదు. 2 లేదా 3 చిత్రాలకు మించి ఆమె ఇక్కడ కొనసాగలేదు. త్వరలో ఈమె బాలీవుడ్‌నుంచి వెళ్లిపోతుంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. 

Image result for adhi neevevaro movie

కాగా ఆ నెటిజన్ కి తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది తాప్సి. ‘నేను నటించిన మూడు చిత్రాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ‘ముల్క్’, ‘మన్మార్జియాన్‌’, ‘బాద్లా’ చిత్రాలు పూర్తవ్వడంతో పాటు మరో రెండు చిత్రాలకు ఇటీవలే సంతకాలు చేశాను.‌ కాబట్టి మీరు కొంచెం భరించాల్సి ఉంటుంది’ అంటూ సమాధానం ఇచ్చింది. మరో నెటిజన్ ట్విట్ చేస్తూ..మీ చిత్రాలు చూడటానికి అంతగా బాగోవు’ అని ట్వీట్‌ చేశాడు. 
Image result for adhi neevevaro movie
అందుకు తాప్సి.. ‘సినిమాలు చూడటంలో మీ అభిరుచిని మార్చుకోండి. అప్పుడు చిత్రాలన్నీ బాగానే కనిపిస్తాయి’ అని బదులిచ్చింది. మొత్తానికి నెటిజన్లకు కూల్ గా స్పందిస్తూ..ఘాటుగా సమాధానాలు ఇస్తుంది తాప్సి. ఆది హీరోగా నీవెవరో’చిత్రంలో నటిస్తుంది తాప్సి. రితికా సింగ్‌ మరో కథానాయిక. ‘గుండెల్లో గోదారి’ తర్వాత ఆది-తాప్సి కలిసి నటిస్తున్న చిత్రమిది. 



మరింత సమాచారం తెలుసుకోండి: