ప్రస్తుతం యూత్ కు ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ నటనలో అతడి డ్రస్సింగ్ లో యాటిట్యూడ్ లో ఎదో ఒక తెలియని మాయ ఉంది. అందుకే అతడి ఇమేజ్ టాప్ యంగ్ హీరోల లెవల్ లో రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్నప్పుడు దేశం గర్వించ తగ్గ క్రికెటర్ అవుదామని కలలు కన్న విజయ్ ఆరంగంలో తాను రాణించలేనని తనకు తానే తెలుసుకుని అనుకోకుండా తనలో నటుడు ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించి ప్రస్తుతం హీరోగా మారాడు.
vijay devarakonda taxi wala teaser Latest 2018 - Sakshi
‘గీత గోవిందం’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు అనేకం షేర్ చేస్తూ తనకు తన తల్లి ఇచ్చిన వార్నింగ్ ను బయట పెట్టాడు. భగవంతుడు మనకు ఇచ్చిన జ్ఞానేంద్రియాలను ఎప్పటికప్పుడు సంతోష పెడుతూ కళ్ళకు నచ్చిన కొత్త ప్రదేశాలు శరీరం అలిసిపోయేలా ఆటలు నాలికకు కొత్త రుచులు తెలిసేలా సరికొత్త డిష్ లు ప్రయత్నిస్తూ ఉండాలని అలా చేయకపోతే మన జ్ఞానేంద్రియాలకు మనల్ని శపిస్తాయి అంటూ తన తల్లి తనకు ఇచ్చిన వార్నింగ్ ను బయట పెట్టాడు. 

ఇదే సందర్భంలో తన సినిమాల కెరియర్ గురించి మాట్లాడుతూ ‘పెళ్ళి చూపులు’ సూపర్ హిట్ అయ్యాక చాలామంది తనను ఆసక్సస్ ను విపరీతంగా ఎంజాయ్ చేయమని సలహా ఇచ్చారని చెపుతూ అలాంటి హిట్ మళ్ళీ రావాలి అంటే మరో 10 సంవత్సరాలు పడుతుంది అని అన్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.అయితే తాను ‘పెళ్ళి చూపులు’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ ఖాళీగా కూర్చో లేదని దానికి మించిన హిట్స్ ఇవ్వాలనే తపనతో నటించిన సినిమాలు ‘అర్జున్ రెడ్డి’ ఆపై ‘గీత గోవిందం’ అని అంటున్నాడు. 
Vijay Devarakonda Applies for New Job
ఇక తన వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలియని ఒక న్యూస్ ను బయటపెట్టాడు విజయ్ దేవరకొండ. తాను హీరో కాకముందే తన జీవితంలో ఒక అమ్మాయి ఉందని ఆఅమ్మాయి తనను ఎంతో ప్రోత్సహించింది అని చెప్పుతూ ఆమె తన దృష్టిలో ‘దేవత’ అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పడమే కాకుండా ఆఅమ్మాయి గురించి ప్రస్తుతానికి ఇంతకు మించి ఏ విషయాలు చెప్పను అంటూ తన రియల్ లవ్ సీక్రెట్ బయట పెట్టాడు. తాను చేస్తున్న సినిమాల కథలు అన్నీ తన తండ్రి ఓకె చెప్పిన తరువాత మాత్రమే చేస్తాను అని అంతో తన దృష్టిలో ఒక పెద్ద గైడ్ అయితే తన తల్లి ఒక కంఫర్ట్ అంటూ తన తల్లితండ్రుల పై తనుకు ఉన్న అభిమానాన్ని బయట పెట్టాడు విజయాన్ని చిరునామాగా మార్చుకున్న విజయ్ దేవరకొండ..



మరింత సమాచారం తెలుసుకోండి: