నిన్నమొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే వెంటనే సల్మాన్ ఖాన్ పేరు చెప్పేసేశారు. కాని ఇప్పుడు ఆయన బాటలోనే టాలీవుడ్ హీరో కూడా నడుస్తున్నాడు. ఈపాటికే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరో తెలిసిపోయిు ఉంటుంది కదా. మీరు ఊహించింది కరెక్టే.. ఈ మధ్యకాలంలో ప్రభాస్ పెళ్లి గురించి విపరీతంగా వార్తలు వస్తున్నాయి.  


అంతేకాదు ఈ బాహుబలికి రియల్ లైఫ్ లో దేవసేన లాంటి అమ్మాయి వస్తుందా.. లేక అవంతిక లాంటి అందగత్తె వస్తుందా.. అని తెగ చర్చించుకుంటున్నారు. ఇదిలాఉంటే ఈ యంగ్ హీరో ఫ్యామిలీ మాత్రం పెళ్లి కూతురును వెతికే పనిలో బిజీ బిజీగా ఉంది. ప్రభాస్ ఒకే చెబితే చాలు బ్యాండ్ మోగించేందుకు రెడీ అంటూ సీనియర్ రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఇప్పటికే ప్రకటించేశారు. ప్రభాస్ పెళ్లి విషయంలో తనకూ కాస్తంత కంగారుగానే ఉందని అన్నారు.   


తాము పెళ్లి గురించి గట్టిగానే పట్టుబడుతున్నామని పెద్దనాన్న చెప్పుకొచ్చారు. కాకాపోతే ఈ యంగ్ హీరోనే ఇంకా ఆలోచిస్తున్నాడట. ఈ విషయాలు స్వయంగా ఆయనే ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యలో వెల్లడించారు. తాము ఎంత పోరుపెట్టినా ప్రభాస్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నెల్ రాలేదని వాపోయారు. 


బాహుబలి తర్వాత తన పెళ్లి ఉంటుందని ఈ రాకుమారుడు చెప్పింది నిజం కాలేదు. తాజాగా కొత్త న్యూస్ హల్ చల్ చేస్తోంది. సాహో తర్వాతే తన నిర్ణయాలు ఉంటాయని తన స్నేహతులతో డార్లాంగ్ ప్రభాస్ అన్నాడని టాక్. దీంతో ఈ న్యూస్ ఒక్క టాలీవుడ్ లోన కాదు అటు బాలీవుడ్ లోనూ వైరల్ అయిపోయింది. అనుష్కతో ఎఫైర్ నడుపుతున్నాడని ఆమెనే పెళ్ళి చేసుకుంటాడని కూడా మరో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.  ఇద్దరు ఈ వార్తలకు ఎన్నిసార్లు సమాధానం చెప్పినా ఆ వార్తలు మాత్రం ఆగట్లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: