బిగ్ బాస్ లో అందరిది ఒకదారైతే తనదో దారి అంటూ మొదటి నుండి ఇంటి సభ్యులకు ఎగైనెస్ట్ గా ఉంటూ ప్రస్తుతం ఇంట్లో గొడవలకు తానో కారణమవుతున్న కౌశల్ బయట మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. చివరి రెండు వారాలే అవడం వల్ల ఆట మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఆరుగురు హౌజ్ మెట్స్ లో కౌశల్ తప్ప మిగతా ఐదుగురు కౌశల్ ను బ్యాడ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి క్షణం ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది.
అయితే కౌశల్ ఆర్మీ మాత్రం ఇవన్ని గమనిస్తూనే ఉంది. బిగ్ బాస్-2 టైటిల్ కచ్చితంగా కౌశల్ కే వస్తుందని కౌశల్ ఆర్మీ చెబుతుంటే రెండు వారాలుగా ఎలిమినేట్ అయిన శ్యామలా, అమిత్ లు అసలు కౌశల్ పేరుని టాప్ త్రీలో ప్రస్థావించలేదు. ఇదిలాఉంటే బిగ్ బాస్-2లో కౌశల్ కు ఏర్పడిన క్రేజ్ దృష్ట్యా అతనికి సినిమా అవకాశాలు వస్తున్నాయట.
ఏకంగా బాలయ్య సినిమాలో కౌశల్ క్రేజీ రోల్ అందుకున్నాడని తెలుస్తుంది. కౌశల్ ఫాలోయింగ్ చూసి అతనికి సినిమా అవకాశాలు ఇస్తున్నారట. ఇప్పటికే పూరి జగన్నాథ్ కౌశల్ తో సినిమా చేస్తానని చెప్పగా.. బోయపాటి శ్రీను కూడా కౌశల్ కు ఛాన్స్ ఇస్తున్నాడట. ప్రస్తుతం రాం చరణ్ మూవీ చేస్తున్న బోయపాటి శ్రీను తన తర్వాత సినిమా బాలకృష్ణతో చేస్తున్నాడు.
ఆ సినిమాలో విలన్ రోల్ లో కౌశల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ వల్ల మిగతా ఇంటి సభ్యులకు ఏం లాభం చేకూరిందో తెలియదు కాని కౌశల్ కు మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ లెక్కన టైటిల్ విన్ అయినా కాకున్నా కౌశల్ క్రేజ్ మాత్రం అందరికి తెలిసేలా బిగ్ బాస్ ఉపయోగపడింది.