తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రణయ్ హత్యపై నేడు నింధితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కేవలం కులం తక్కువ యువకుడిని పెళ్లి చేసుకున్నందుకు..కక్ష్య కట్టి తన కూతురు ఎదురుగానే అతి దారుణంగా నరికించాడు. అయితే ప్రణయ్ హత్యపై సినీ, రాజకీయ నేపథ్యంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ కాలంలో కూడా కులాల కోసం ఇంతగా వెంపర్లాడటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యపై మంచు మనోజ్ స్పందిస్తూ ఎమోషనల్ గా ఓ లేఖని రాసిన సంగతి తెలిసిందే.
ఆయన పోస్ట్ చేసిన ఆ లెటర్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మనోజ్ ట్విట్ కి కొంత మంది పాజిటీవ్ గా స్పందిస్తే..మరికొంత మంది నెగిటీవ్ గా ట్రోల్ చేశారు. నువు అలాంటి పని చేస్తే మీ నాన్న ఊరుకుంటారా..అంటూ ప్రశ్నలు సందించారు. దీంతో వారికి ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు మనోజ్. తనతో ఈ విషయంపై వాదించిన వ్యక్తిని ఉద్దేశిస్తూ నీ ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి నా అసలైన భాషలో మాట్లాడతాను అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ స్పందించి..ఈ కులం పిచ్చోళ్లు ఎప్పటికీ మారారన్నా.. వారిని వదిలేయ్ అంటూ ట్వీట్ చేయగా దానికి స్పందించిన మంచు మనోజ్.
''వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం.. తొక్క'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో మంచు మనోజ్ చాలా ప్రెస్టేషన్ లో ఉన్నట్లు కనిపిస్తుందని..అంటున్నారు. మరికొందరు మనోజ్ తో మాత్రం వితండవాదం చేస్తుండడంతో వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీ లాంటి వారికి ఆరోగ్య సమస్య వస్తే ఇతర కులాల డాక్టర్ల వద్దకు ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నించారు.