బిగ్ బాస్-2 చివరి వారాల్లో గొడవలు తారాస్థాయికి చేరాయని తెలుస్తుంది. సోమవారం ఎపిసోడ్ అంతా హాట్ హాట్ గా సాగగా దానికి కొనసాగింపుగా జరిగిన మంగళవారం టాస్క్ లో కూడా కౌశల్ మీద తనీష్, సామ్రాట్ ల తన కోపాన్ని చూపించారు. ఇసుకని కాపాడుకునే క్రమంలో రోల్ రైడా ఫినాలే వెళ్లే క్రమంలో ఒక స్టెప్ ముందుకెళ్లాడు.  


ఇక ఈ టాస్క్ లో కూడా కౌశల్ ను ఇంటి సభ్యులంతా టార్గెట్ చేయడం జరిగింది. ఇదిలాఉంటే రేపటి ఎపిసోడ్ ప్రోమోగా వదలగా తాను ఏదైనా చేస్తే అందరు కుక్కల్లా మీద పడతారు అని కౌశల్ అనగా.. ఎవర్ని కుక్కలంటున్నావ్ అంటూ సామ్రాట్ కౌశల్ మీదకు వెళ్లాడు. ఇక మరోపక్క తనీష్ కూడా కుక్కలెవరిక్కడ అంటూ గొడవకు దిగాడు.  


ఇక కుక్కలన్న మాటకి బాగా హర్ట్ అయిన రోల్ రైడా ఏడుస్తూ ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి రేపటి ఎపిసోడ్ లో కూడా తన దారి తనదే అంటూ కౌశల్.. అతని మీద ఎటాక్ చేస్తూ ఇంటి సభ్యులు.. ఇలా అందరికి అందరు గేం రూల్స్ మాత్రమే కాదు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలన్న ఆలోచనని మానేసి దెబ్బలాడుతున్నారు.  


ఆల్రెడీ ఇసుక టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ రూల్స్ కు విరుద్ధంగా చేసినందుకు కౌశల్, తనీష్ లకు వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్ ఇంకోసారి ఇలా చేస్తే హౌజ్ విడిచి వెళ్లాల్సి వస్తుందని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. చివరి రోజుల్లో కౌశల్ తన చాదస్తం మరీ పెంచాడని కొందరంటుంటే కౌశల్ ను మిగతా ఇంటి సభ్యులే అర్ధం చేసుకోవట్లేదు అన్నది కొందరి వాదన. ఏది ఎలా ఉన్నా గొడవలతో బిగ్ బాస్ సీజన్ 2 హాట్ హాట్ గా వేడెక్కేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: