మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. తాజాగా "అరవింద సమేత"లో మరో పాట విడుదలైంది. పెనివిటి అంటూ సాగే ఈ పాట బాగా ఎమోషనల్ లిరిక్స్‌తో వచ్చింది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించాడు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా రెండో సింగిల్ లిరికల్ వీడియో అందరికీ కంట తడి పెట్టించేలా ఉంది. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా కాల భైరవ పాడారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టిన చిత్రయూనిట్.. రోజుకో సర్ప్రైజ్ ఇస్తూ ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ మూవీలో మొత్తం నాలుగు పాటలు ఉండగా ఇప్పటికే రెండు సాంగ్స్ ను రిలీజ్ చేశారు.
ఆ మధ్య కొద్దిరోజుల పాటు సైలెంట్ ఉన్న టీమ్ ప్రమోషన్ విషయంలో వేగం పెంచింది. అక్టోబర్ 11 విడుదల ఖరారైనప్పటికీ ప్రీ రిలీజ్ లోనే ప్రకటించాలని గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. కాగా, పెనిమిటి పాట గురించి ఒక్కొక్కరు ఒక్కోరకంగా పొగడ్తలతో ముంచెత్తడంతో ఫ్యాన్స్ లో ఉత్సుకత పెరుగుతూ పోతోంది. దర్శకుడు సుధీర్ వర్మ రెండు రోజుల క్రితమే దీని గురించి ఓ రేంజ్ లో ట్వీట్ చేయటం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసేలా చేసింది. దశాబ్దాల పాటు నిలబడిపోయే పాట అవుతుందని చెప్పడం విశేషం. మొత్తానికి పెనిమిటి మీద అల్లుకున్న హైప్ చూస్తుంటే వ్యూస్ తో హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.