తమిళనాట హీరో విక్రమ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ‘సామి’ ఒకటిగా కనిపిస్తోంది. ఇక తెలుగులో బోయపాటి.. తమిళ్ లో హరి వీరిద్దరు మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకులు. ఫైట్స్, సెంటిమెంట్, ఎమోషన్స్ మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా సినిమాలు తీస్తుంటారు. హరి దర్శకత్వంలో వచ్చిన సింగం సిరీస్ తెలుగులోనూ సూపర్ హిట్. హరి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సామి స్క్వేర్’. 2003 బ్లాక్‌బస్టర్ ‘సామి’కి సీక్వెల్‌గా వస్తోన్న సినిమా ఇది. తెలుగులో ‘సామి’ పేరుతో విడుదల కానుంది.
ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని, సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలతో పాటు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. బాబీసింహా విలన్‌గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ‘‘సింగం, సింగం 2, సింగం 3, పూజా’’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌పై బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన 'సామి' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్,బాబీ సింహ, సూరి తదితరులు కీలక పాత్రలు పోషించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైనఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. మత్స్యస్వామి, కూర్మస్వామి, వరాహస్వామి, నరసింహస్వామి, రావణ స్వామి, పరశురామస్వామి..’ అనే డైలాగ్ బాగా ఆకట్టుకొంది.